ETV Bharat / international

కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో శిశువు జననం

author img

By

Published : Mar 17, 2021, 10:53 PM IST

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో కొవిడ్​ యాంటీబాడీస్​తో శిశువు జన్మించింది. ఫ్లోరిడాకు చెందిన ఒకామె 36 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు కొవిడ్ టీకా తీసుకోగా.. మూడు వారాల తర్వాత జనవరిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువు రక్త నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. శిశువులో కొవిడ్ యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు గుర్తించామని అక్కడి శిశు వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ గిల్‌బర్ట్‌ పేర్కొన్నారు.

vaccinated-florida-woman-gives-birth-to-first-known-baby-born-with-covid-antibodies
కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో శిశువు జననం

కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న వేళ మానవాళికి తీపికబురు. ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ యాంటీ బాడీస్‌తో ఓ శిశువు భూమిపై అడుగు పెట్టింది. కొవిడ్ టీకా (మోడెర్నా) తీసుకున్న ఆరోగ్య కార్యకర్త ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఒకామె 36 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు కొవిడ్ టీకా తీసుకున్నారు. మూడు వారాల తర్వాత జనవరిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువు రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. ఈ పరిశోధనలో శిశువులో కొవిడ్ యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు గుర్తించామని అక్కడి శిశు వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ గిల్‌బర్ట్‌ పేర్కొన్నారు.

కొవిడ్ టీకా తీసుకున్న గర్భిణిలోనే కాక ఆమెకు జన్మించిన బిడ్డలోనూ యాంటీ బాడీలు వృద్ధి చెందాయని గిల్‌బర్ట్‌ వివరించారు. ఇటువంటి ఘటన ప్రపంచంలో తొలిసారిగా జరిగిందని చెప్పారు. అయితే, ఈ కొవిడ్ యాంటీ బాడీలు శిశువుకు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని మరో వైద్యుడు డాక్టర్‌ చాడ్‌ రుడ్నిక్‌ తెలిపారు.

ఇదీ చదవండి : చైనా, హాంకాంగ్ అధికారులపై అమెరికా ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.