ETV Bharat / international

కరోనాపై పోరులో భారత్​కు అమెరికా ఆర్థిక సాయం! - ఆర్థిక సాయం

కరోనాను కట్టడి చేసేందుకు భారత్​కు ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. యూఎస్ ఏఐడీ ద్వారా ఇప్పటికే ఇచ్చిన 2.9 మిలియన్ డాలర్లకు తోడు మరో 3 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.

USAID
కరోనాపై పోరుకు భారత్ కు అమెరికా ఆర్థిక సాయం!
author img

By

Published : Apr 30, 2020, 12:41 PM IST

కరోనాపై పోరులో భారత్​కు మరో విడత ఆర్థిక సాయం ప్రకటించింది అమెరికా. యూఎస్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ ఏఐడీ) ద్వారా మరో 3 మిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ఈనెల 6న యూఎస్ ఏఐడీ సుమారు 2.9 మిలియన్ డాలర్లు భారత్​కు ఇస్తున్నట్లు ప్రకటించింది.

భారత్​లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అదనపు నిధులు.. ఇరు దేశాల మధ్య బలమైన, నిరంతర భాగస్వామ్యానికి మరో ఉదాహరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

యూఎస్ ఏఐడీ అనేది ప్రముఖ అంతర్జాతీయ సహాయ సంస్థలో ఒకటి. పహల్​ ప్రాజెక్టు కింద భారత్​కు ఈ నిధులను అందిస్తోంది. కొవిడ్-19పై పోరు కోసం ఇప్పటి వరకు భారత్ కు 5.9 మిలియన్ డాలర్ల సాయం చేశాం. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, బాధితులకు చికిత్స, ప్రజలకు అవగాహన కల్పించటం, కేసుల గుర్తింపు చర్యలను పటిష్ఠం చేయటం, నిఘా వంటి వాటికి ఈ నిధులు ఉపయోగించాలి.

-కెన్నెత్ జస్టర్, భారత్​లో అమెరికా రాయబారి

50 కోట్ల మంది పేదల కోసం ఆరోగ్య బీమా పథకం, ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన కింద చేరిన 20 వేల ఆస్పత్రులకు సహాయం అందించేందుకు వనరులను సమీకరించడానికి సాయం చేయనున్నట్లు తెలిపారు జస్టర్.

ఇదీ చూడండి: ఆంక్షల కొనసాగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.