అమెరికాలో కాల్పుల మోత మోగింది. గన్‌తో వచ్చిన దుండగుడు చికాగోలో ముగ్గురిని కాల్చి చంపాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 15 ఏళ్ల బాలిక చికిత్స పొందుతోంది. భద్రతాధికారులపైనా కాల్పులు జరపగా.. ఎవరికీ గాయాలు కాలేదు. చివరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. మృతుల పేర్లను పోలీసులు విడుదల చేయలేదు.
పెరిగిపోతున్న గన్ కల్చర్..
చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన నైటెంగేల్ అనే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల వెనుక ఉద్దేశం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్‌పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదీ చదవండి: మంచు గడ్డలతో యువకుల ఫైటింగ్