ETV Bharat / international

'ఆ లోపు ఒప్పందం కుదరకపోతే టిక్​టాక్​పై వేటే'

author img

By

Published : Aug 4, 2020, 5:36 AM IST

టిక్​టాక్ కొనుగోలుపై జరుగుతున్న చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. సెప్టెంబర్ 15లోపు చర్చలు ముగియకపోతే యాప్​పై నిషేధం విధించనున్నట్లు స్పష్టం చేశారు.

US will ban Tiktok on September 15 unless an American company buys it, says Trump
'ఆ లోపు ఒప్పందం కుదరకపోతే టిక్​టాక్​పై వేటే'

భారత్​లో నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్ యాప్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. టిక్​టాక్ కొనుగోలు అంశంపై జరుగుతున్న చర్చలు సెప్టెంబర్ 15నాటికి పూర్తి కాకపోతే నిషేధం విధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

"ఒప్పందం కుదురుతుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ మైక్రోసాఫ్ట్​ గానీ మరేఇతర సంస్థ గానీ టిక్​టాక్​ను కొనుగోలు చేసేందుకు సరైన ఒప్పందం చేసుకోలేకపోతే సెప్టెంబర్ 15న మేం మూసేస్తాం. సరైన ఒప్పందం కుదిరితే అమెరికా ఖజానాకు చాలా డబ్బు వస్తుంది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

అమెరికాలో టిక్​టాక్​ను బ్యాన్​ చేసే యోచనలో ఉన్నట్లు ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దేశ భద్రత వంటి విషయాల్లో టిక్​టాక్ ముప్పుగా పరిణమించిందనే ఆరోపణల మధ్య ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు ట్రంప్.

గడువు లోపే..

మరోవైపు.. మైక్రోసాఫ్ట్​ సంస్థ టిక్​టాక్​ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు టిక్​టాక్ యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల... టిక్​టాక్​ కొనుగోలు అంశంపై అధ్యక్షుడు ట్రంప్​తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ చర్చలు సెప్టెంబర్ 15లోపే ముగుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.