ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ అనేక దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. అమెరికాలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కొంతమంది కరోనా సోకిన చట్టసభ సభ్యులు కలిశారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పరీక్షలు జరిగాయో లేదో తనకు తెలియదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్కొన్నారు.
అదే సమయంలో ఫిబ్రవరిలో జరిగిన అధ్యక్షుడి సమావేశంలో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధరించారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్‌తో కొంతమంది చట్టసభ సభ్యులు సన్నిహితంగా మెదిలారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి నుంచి తమకు వైరస్ సోకి ఉండవచ్చన్న అనుమానాలతో.. వారు తమకు తాము గృహ నిర్బంధం విధించుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు అమెరికాలో 600కేసులు నమోదు కాగా.. 25 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.