ETV Bharat / international

'టీకా ఉత్పత్తిలో భారత్​కు అమెరికా మద్దతు' - వ్యాక్సినేషన్​ ఉత్పత్తి

టీకా తయారీలో భారత్​కు అమెరికా తోడుంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. ప్రపంచ దేశాలకు అవసరమైన వాటిలో 50కోట్ల​ డోసులను ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

Biden, vaccine
జో బైడెన్​
author img

By

Published : Aug 4, 2021, 9:27 AM IST

Updated : Aug 4, 2021, 12:45 PM IST

భారత్​, ఇతర దేశాలకు టీకా తయారీలో అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డోసులు అవసరం ఉన్నందున.. అగ్రరాజ్యం సుమారు 50కోట్ల​ డోసులు ఇవ్వడానికి కట్టుబడి ఉందని తెలిపారు.

"అర బిలియన్ డోసులను భారత్​ సహ ప్రపంచ దేశాలకు ఇవ్వడానికి అమెరికా కట్టుబడి ఉంది. అంతేగాకుండా మరిన్ని డోసులు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు కూడా మేము సహాయసహకారాలు అందిస్తాం."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

కొవాక్స్​ కార్యక్రమం ద్వారా పేద దేశాలకు ఉచితంగా టీకా డోసులు అందిస్తామని బైడెన్​ తెలిపారు. ఆగస్టు నెలాఖరు వరకు 100 పేద దేశాలకు మరో 5 లక్షల ఫైజర్ టీకాలను పంపించనున్నట్లు బైడెన్‌ పేర్కొన్నారు. సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని గతంలో అమెరికా హామీ ఇచ్చింది.

రూ. 37కోట్ల సేకరణకు భారత సంతతి డాక్టర్ల శ్రీకారం

భారత సంతతికి చెందిన అమెరికన్​ డాక్టర్లు కరోనా రిలీఫ్​లో భాగంగా సుమారు 37 కోట్ల రూపాయిలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మొత్తంతో 2,300 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, 100 వెంటిలేటర్లు, 100 హై ఫ్లో నాసల్​ మిషన్​లను కొనుగోలు చేసి భారత్​లోని 45 ఆసుపత్రులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రవాస భారతీయుల వైద్యుల సంఘం​ పేర్కొంది.

ఇదీ చూడండి: ‍‍‍ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిన కొవిడ్​ కేసులు

Last Updated : Aug 4, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.