ETV Bharat / international

'ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు- అంతిమ విజయం నాదే' - trump election claim latest news

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ప్రస్థుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ససేమిరా అంటున్నారు. మొత్తం ఓట్లు లెక్కించాక తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

US-TRUMP-ELECTION-CLAIM
'ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు- అంతిమ విజయం నాదే'
author img

By

Published : Nov 11, 2020, 5:20 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఏ మాత్రం అంగీకరించలేకపోతున్నారు డొనాల్డ్​ ట్రంప్​. ఓటమిని ఒప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకా ఓట్ల కౌంటింగ్​ పూర్తి కాలేదని.. అన్ని ఓట్లు లెక్కించాక విజయం సాధించేది తానేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్​ ఓటింగ్​ వ్యవస్థను సైతం ట్రంప్​ ధూషించారు.

"న్యాయం మనవైపే ఉంది. మనం విజయం సాధిస్తాం.ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చేవారం వెలువడతాయి. మరోసారి అమెరికా గొప్పదేశమని నిరూపిద్దాం.''

---డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

మరో 45 ఎలక్టోరల్​ ఓట్ల లెక్క తేలాల్సి ఉంది. పెన్సిల్వేనియా , జార్జియా, మిచిగాన్​, నెవాడా, విస్కాన్సిన్​ రాష్ట్రాల్లో మళ్లీ ఓట్లను లెక్కించాలని ట్రంప్ వర్గాలు కోర్టుల్లో పిటిషన్​లు వేశాయి.

మొత్తం 538 ఎలక్టోరల్​ ఓట్లకుగానూ 270 మార్కును అందుకుంటే విజయం సాధించినట్లే. ఇప్పటికే డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​ 279 ఎలక్టోరల్​ ఓట్లు సాధించారు. ట్రంప్​ 214 వద్దే ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.