ETV Bharat / international

కరోనా దెబ్బకు అమెరికా 14 రోజులు బంద్!

కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం బెంబేలెత్తిపోతోంది. వైరస్ నియంత్రణకు ఇప్పటికే పటిష్ఠ చర్యలు చేపట్టిన ఆ దేశం.. ఇప్పుడు 14 రోజుల పాటు దేశవ్యాప్తంగా బంద్ పాటించాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

us-to-shutdown-for-14-days-dot
కరోనా దెబ్బకు అమెరికా 14 రోజులు బంద్!
author img

By

Published : Mar 16, 2020, 11:18 AM IST

ప్రపంచ దేశాలకు పెను సవాల్​గా మారిన కరోనా దెబ్బకు అగ్రరాజ్యం సైతం హడలిపోతోంది. వైరస్​ నియంత్రణకు ఇప్పటికే పటిష్ఠ చర్యలు చేపట్టిన అమెరికా.. 50 మందికంటే ఎక్కువ మంది ప్రజలు గుమికూడవద్దని సూచించింది. ఇప్పుడు దేశాన్నే ముసివేసే అలోచనలో ఉంది.

కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు అక్కడి గవర్నర్లు, మేయర్లు. అమెరికాలో అత్యధిక పాఠశాలలున్న న్యూయార్క్​లో విద్యాసంస్థలను మూసివేశారు అధికారులు. ఏప్రిల్​ 20వరకు సెలవులు ప్రకటించారు.

14రోజుల షట్​డౌన్​

కరోనా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చకుండా ముందు జాగ్రత్త చర్యగా 14 రోజులు అమెరికాను మూసివేయాలని సూచిస్తున్నారు ఆ దేశ వైద్య నిపుణులు. ఇలా చేస్తే మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి శ్వేతసౌధం నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రాలేదు. ట్రంప్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు అధికారులు.

దుకాణాలు ఖాళీ..

అమెరికాలో ఆహార పదార్థాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగి చాలా దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల కొరతపై ఎలాంటి ఆందోళన వద్దని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రజలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు.

కరోనా వైరస్ ​కారణంగా అమెరికాలో 64మంది మృతిచెందారు. 3,200మందికి వైరస్​ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 6వేలు దాటింది. 1,62,000 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.

లెబనాన్​లో నిర్బంధం

కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలందరూ రెండు వారాల పాటు ఇళ్లకే పరిమితం కావాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. ముఖ్యమైన విమానాశ్రయాలను మూసివేసింది.

దక్షిణాఫ్రికాలో విపత్తు..

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది దక్షిణాఫ్రికా. 100 కంటే ఎక్కువ మంది ప్రజలు గుమికూడవద్దని ఆంక్షలు విధించింది. ఈ కారణంగా ప్రవాస భారతీయులు నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 61 కరోనా కేసులు నమోదయ్యాయి.

వెనిజువెలాలో ఏడు రాష్ట్రాల్లో

కరోనా నియంత్రణ చర్యగా వెనిజువెలాలోని ఏడు రాష్ట్రాల్లో నిర్భంధం విధిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో.

టర్కీలో భక్తుల నిర్బంధం

సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వస్తున్న వేలాది మంది భక్తులను నిర్బంధించింది టర్కీ. కరోనా కేసుల సంఖ్య ఆ దేశంలో 18 చేరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: 45 మంది యువకులపై నేడు కరోనా వ్యాక్సిన్​ ప్రయోగం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.