ETV Bharat / international

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్​కు ఎదురుదెబ్బ - సుప్రీం కోర్టుకు ట్రంప్​

అమెరికా సర్వోన్నత న్యాయస్థానంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చుక్కెదురైంది. జో బైడెన్​ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీంకోర్టు.

Donald trump
అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్
author img

By

Published : Dec 12, 2020, 7:32 AM IST

Updated : Dec 12, 2020, 8:24 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటానికి దిగిన అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. జో బైడెన్​ ఎన్నికను రద్దు చేయాలంటూ రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత మంగళవారం పెన్సిల్వేనియా కోర్టు.. రిపబ్లికన్ల అభ్యర్థనను తిరస్కరించగా.. తాజాగా ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం అదే తీర్పును పునరుద్ఘాటించింది.

సుప్రీంకోర్టు తిరస్కరించిన​ వ్యాజ్యానికి ఇద్దరు అగ్రనేతలు సహా సగానికిపైగా హౌజ్​ రిపబ్లికన్లు మద్దతుగా నిలిచారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఎలక్టోరల్​ ఓట్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును టెక్సాస్​ అటార్నీ జనరల్​​ ఆశ్రయించగా.. వారికి 17 మంది రిపబ్లికన్​ అటార్నీ జనరల్స్​, కాంగ్రెస్​లోని 126 మంది సభ్యులు మద్దతు తెలిపారు.

అయితే.. ఈ పిటిషన్లపై డెమొక్రటిక్​ నేతలతో పాటు పలువురు రిపబ్లికన్లు సైతం ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. ​

సోమవారం ఎలక్టోరల్​ కాలేజీ భేటీ..

మరోవైపు అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సోమవారం మరో అడుగు వేయనున్నారు బైడెన్​. ఎలక్టోరల్​ కాలేజీ.. సోమవారం సమావేశమయ్యి బైడెన్​ను అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నుకోనుంది.

ఇదీ చూడండి: ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు ట్రంప్​

Last Updated : Dec 12, 2020, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.