ETV Bharat / international

కరోనా రగడ: అమెరికా కోర్టులో చైనాపై కేసు - కరోనా వైరస్​ అమెరికా

కరోనా వైరస్​పై అనేక అబద్ధాలు చెప్పిందంటూ చైనా ప్రభుత్వంపై అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్​ దాఖలైంది. ప్రజలకు వైరస్​పై తప్పుడు సమాచారాలిచ్చి, ఆధారాలను చైనా అధికారులు కప్పిపుచ్చారని పిటిషనర్​ పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్​ వ్యవహారం అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు మరింత పెరిగాయి.

us-state-files-lawsuit-against-china-on-coronavirus-handling
చైనాపై అమెరికాలో 'కరోనా' వ్యాజ్యం
author img

By

Published : Apr 22, 2020, 11:36 AM IST

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు కరోనా సంక్షోభంతో మరోమారు తారస్థాయికి చేరాయి. తాజాగా చైనా ప్రభుత్వం, అధికారులు, వ్యవస్థలకు వ్యతిరేకంగా అమెరికా మిస్సోరీలోని ఓ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వైరస్​ ఎంతటి ప్రమాదకరమో చెప్పకుండా చైనా దాచిపెట్టిందని, ఫలితంగా ప్రపంచం అస్తవ్యస్తంగా మారిందని పిటిషన్​ దాఖలు చేసిన అటార్నీ జనరల్​ ఎరిక్​ స్క్మిట్​ ఆరోపించారు.

వ్యాజ్యంలో చైనాపై ఆరోపణలు...

  • వైరస్​ విజృంభించిన తొలినాళ్లలో ప్రజలను చైనా మోసం చేసింది.
  • కీలక సమాచారాలను అధికారులు దాచిపెట్టారు.
  • ప్రజావేగులను అరెస్టు చేశారు.
  • 2019 డిసెంబర్​లోనే ఆధారాలున్నప్పటికీ.. మనిషి నుంచి మనిషికి వైరస్​ వ్యాపించదని చైనా చెబుతూనే ఉంది.
  • కీలక వైద్య పరిశోధన నివేదికల్ని ధ్వంసం చేసింది.
  • ప్రజలను అప్రమత్తం చేయకుండా.. లక్షల మందిని వైరస్​ బారిన పడేలా చేసింది.
  • వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)ను దాచిపెట్టింది.

చైనా వల్లే అంతా...

"ప్రపంచాన్ని కరోనా వైరస్​ కోలుకోలేని దెబ్బ తీసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మిస్సోరీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వేల మంది వైరస్​ బారిన పడ్డారు. చాలా మంది ఉపాధి కోల్పోయారు. నెలవారీ జీతంపై అధారపడే వాళ్లు.. తిండి తినలేకపోతున్నారు. ఇందుకు కారణం చైనా. వైరస్​పై చైనా ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పింది. కరోనా విజృంభణను అడ్డుకోలేకపోయింది. వీటికి చైనా మూల్యం చెల్లించాల్సిందే."

--- ఎరిక్​ స్క్మిట్​, మిస్సోరీ అటార్నీ జనరల్​.

వాణిజ్య ఒప్పందంపై...

రెండేళ్ల వాణిజ్య యుద్ధం అనంతరం ఈ ఏడాది జనవరిలో అమెరికా-చైనా మధ్య తొలిదశ ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఆ ఒప్పందంపైనా పడేలా కనపడుతోంది.

వుహాన్​లోని ఓ ల్యాబ్​లోనే వైరస్​ పుట్టిందని చైనాపై అమెరికా ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది. నిజం బయటపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా.. తమకు సహకరించకపోతే వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని చైనాను హెచ్చరించారు.

అయితే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం... ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే తిరిగి కొత్తగా చర్చలు జరపవచ్చు. ఈ నిబంధనను చైనా వినియోగించే అవకాశముంది. కానీ ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​కు తాను ఆ అవకాశం ఇవ్వనని ట్రంప్​ స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో చైనాపై తనకంటే కఠినంగా ఎవరూ వ్యవహరించలేదని గుర్తుచేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.