ETV Bharat / international

'చైనా ఆ విషయాన్ని దాచినందుకే 'కరోనా' విజృంభణ' - America corona death toll

నేడు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ వ్యాప్తికి చైనాయే మూలకారణమని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆరోపించారు. చైనాలో బయటపడినట్లు భావిస్తున్న ఈ మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం దాచిపెట్టిందంటూ విమర్శించారు. ఈ విషయం ప్రపంచమంతా తెలుసని.. దాన్నే తాను కూడా నమ్ముతన్నానన్నారు ట్రంప్​.

US slams China for delay in sharing information on corona virus
చైనా వల్లే ఇంతటి భారీ మూల్యం - ట్రంప్‌
author img

By

Published : Mar 21, 2020, 7:03 AM IST

కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్‌పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ఇప్పుడు ప్రపంచమంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా మరోసారి చైనా తీరును తప్పుబట్టారు. చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడినట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఆదిలోనే కట్టడిచేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదనే అభిప్రాయపడ్డారు. ఈ విషయం ప్రపంచానికంతటికీ తెలుసునని, ఇదే నిజమని తానుకూడా బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు ట్రంప్​.

చైనా విఫలమైనందునే..

ఈ వైరస్‌పై కొన్ని నెలలముందే సమాచారం తెలిసి ఉంటే ప్రపంచం మొత్తానికి ఇది విస్తరించేది కాదన్నారు. ఆ సమయంలో వైరస్‌ గురించి వారి దగ్గరున్న సమాచారాన్ని ప్రపంచ దేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ తీవ్రతను ప్రపంచానికి తెలియజేయకుండా అడ్డుపడుతూ చైనా.. అక్కడి వైద్యులు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుందన్నారు. ఇలా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన బీజింగ్‌ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి కారణమైన చైనాపై ప్రతిచర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు.

అంతకుముందు కరోనా వైరస్‌ ప్రాథమిక నివేదికలను బహిర్గతం కాకుండా చైనా తొక్కిపెట్టిందని అమెరికా అధ్యక్ష భవనం జాతీయ భద్రత మండలి(ఎన్‌ఎస్‌సీ)ఆరోపించింది. ఫలితంగా ఈ వైరస్‌ తీవ్రతను అరికట్టగలిగే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కోల్పోయారని ట్విట్టర్‌లో పేర్కొంది.

అమెరికాలో 50 రాష్ట్రాలకు..

అమెరికాలో ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య 200లకు చేరింది. మరో 14 వేల మంది వైరస్​తో చికిత్స పొందుతున్నారు. తాజాగా అమెరికాలో 50 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొవిడ్‌-19 బారినపడిన వారిసంఖ్య 2లక్షలు దాటగా.. పదివేల మందికి పైగా మృతిచెందారు. ఇందులో సగానికి పైగా మరణాలు.. చైనా వెలుపలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 184 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్‌ చైనా బయట అత్యంత వేగంగా విస్తరిస్తోంది.

ఇదీ చదవండి: స్వీయ నిర్బంధంలో ఉన్న అమెరికన్లు ఏం చేస్తున్నారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.