కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 65 ఏళ్లు పైబడిన అమెరికన్లకు ఫైజర్ బూస్టర్ డోసును (US Booster Shots) అందించాలని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (సీడీసీ) సిఫారసు చేసింది. అలాగే 50 నుంచి 64 ఏళ్ల మధ్య ఉండి నర్సింగ్ హోమ్, వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వారికి సైతం.. బూస్టర్ డోసు అందించాలని సీడీసీ సూచించింది.
18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉండి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కూడా అదనపు డోసు (booster dose) ఇచ్చేందుకు సీడీసీ అనుమతించింది. రెండో డోసు టీకా తీసుకొని.. 6 నెలలు పూర్తైన తరువాత మాత్రమే బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అదనపు డోసులు ఇవ్వాలన్న వైద్యుల సూచన మేరకు సీడీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి : Delta variant: కొత్తకోరలు తొడుక్కుంటున్న మహమ్మారి