ETV Bharat / international

చైనాపై ఆంక్షలకు అమెరికా '18 సూత్రాల' ప్రణాళిక​

కొవిడ్​-19 మహమ్మారికి చైనాను జవాబుదారీ చేసేలా 18 పాయింట్ల ప్రణాళికను రచించారు అమెరికా సెనేటర్లు​. వైరస్​ వ్యాప్తిపై ప్రపంచాన్ని వంచించిన చైనాపై చర్యలు చేపట్టాలని కోరారు. ప్రణాళికలో ప్రధానంగా భారత్​తో సైనిక సంబంధాలను బలోపేతం చేయాలని సూచించటం గమనార్హం.

18-point plan
కరోనాకు చైనాను జవాబుదారీ చేసేలా యూఎస్​ 18 పాయింట్ల ప్లాన్​
author img

By

Published : May 15, 2020, 11:13 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనానే కారణమని కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తోంది అమెరికా. చైనాపై చర్యలు తీసుకోవాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచాన్ని కొవిడ్​-19 చుట్టుముట్టేందుకు దారితీసిన అబద్దాలు, వంచన, సమాచారాన్ని కప్పిపుచ్చటం వంటి వాటికి చైనా ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసేందుకు అగ్రరాజ్య సెనేటర్ థామ్​ టిల్లీస్​​ 18-పాయింట్ల ప్రణాళికను ఆవిష్కరించారు. అందులో భారత్​తో మిలిటరీ సంబంధాలను బలోపేతం చేయటం ఒకటి.

చైనా ప్రభుత్వం మోసపూరితంగా కరోనా వివరాలను దాచిపెట్టింది. ప్రపంచంపై వైరస్​ విజృంభించేందుకు కారణమైంది. దాంతో చాలా మంది అమెరికన్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే ప్రభుత్వం సొంత పౌరులను కార్మిక శిబిరాల్లో దాచిపెట్టింది. అమెరికా సాంకేతికతను, ఉద్యోగాలను దొంగిలించింది. మన మిత్ర దేశాల సార్వభౌమత్వాన్ని బెదిరించింది. అమెరికా సహా ప్రపంచ దేశాలకు ఇది ఒక మేల్కొలుపు. కొవిడ్​-19పై అబద్ధాలు చెప్పిన చైనా ప్రభుత్వాన్ని నా ప్రణాళిక జవాబుదారీని చేస్తుంది.

– థామ్​ టిల్లీస్​, సెనేటర్

18-పాయింట్ల ప్రణాళిక​

  1. పసిఫిక్​ రీజియన్​లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి.
  2. 20 బిలియన్​ డాలర్ల నిధుల కోసం సైన్యం చేసిన వినతులను వెంటనే ఆమోదించాలి.
  3. ప్రాంతీయ మిత్ర దేశాలైన భారత్​, తైవాన్​, వియత్నాం వంటి వాటితో సైనిక సంబంధాలను బలోపేతం చేయాలి. ఆయా దేశాలకు ఎగుమతులను పెంచాలి.
  4. సైన్యాన్ని పునరుద్ధరించేందుకు జపాన్​ను ప్రోత్సహించాలి. ప్రమాదకరమైన సైనిక పరికరాలను విక్రయించేందుకు జపాన్​, దక్షిణ కొరియాలకు అవకాశం కల్పించాలి.
  5. తయారీ రంగాన్ని చైనా నుంచి అమెరికాకు తిరిగి తీసుకురావాలి.
  6. చైనాపై మన సరఫరా గొలుసు​ ఆధారపడటాన్ని క్రమంగా తొలగించాలి. అమెరికా సాంకేతికతను చైనా దొంగిలించటాన్ని నిరోధించాలి.
  7. సాంకేతిక పరిజ్ఞాన్ని తిరిగి పొందడానికి అమెరికన్​ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలి.
  8. చైనా నుంచి హ్యాకింగ్​, సైబర్​ దాడులను నిరోధించేందుకు సైబర్​ సెక్యూరిటీని బలోపేతం చేయాలి.
  9. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును చైనా ప్రభుత్వం తన రుణాలు తీర్చేందుకు వినియోగించుకోకుండా ఆపాలి.
  10. చైనా టెక్​ సంస్థ హువావేపై నిషేధం విధించాలి. అలాగే మిత్రదేశాలు ఆ సంస్థను నిషేధించేలా సమన్వయపరచాలి.
  11. కరోనా వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు చైనా ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయాలి. వైరస్​ పై అబద్ధాలు చెప్పినందుకు ఆంక్షలు విధించాలి.
  12. 2022 వింటర్​ ఒలింపిక్స్​ వేదికను బీజింగ్ నుంచి మార్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పరిపాలన విభాగం కోరాలి.
  13. అమెరికాలో చైనా ప్రచారాన్ని ఆపాలి. చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థలను ప్రచార ప్రాక్సీలుగా పరిగణించాలి.
  14. కరోనా వైరస్​ వ్యాప్తిని చైనా కప్పిపుచ్చటంపై అమెరికా దర్యాప్తు చేపట్టాలి. చైనా సరఫరా చైన్​పై ఆధారపడటం, ప్రజల రక్షణ, జాతీయ భద్రత వంటి వాటిపైనా దర్యాప్తు చేయాలి.
  15. పరిశోధనలు, సంస్కరణల ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్రతను కాపాడాలి.
  16. అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా దోపిడి చేసే రుణ-ఉచ్చు దౌత్యాన్ని బహిర్గతం చేసి, అడ్డుకోవాలి.
  17. మహమ్మారులపై నిఘా వర్గాల సమాచార మార్పిడిని పెంచాలి.
  18. విదేశాలు ప్రమాదకరమైన వైరస్​లను నిర్వహించటంపై నిఘా సంస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.