అమెరికాలోని వాషింగ్టన్లో మేడ్-ఇన్-చైనా బొమ్మలను(made in china toys) అధికారులు సీజ్ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్ చేసినట్టు గుర్తించామని వివరించారు(us china news). ఇలాంటి బొమ్మలు భారత్‌లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం(india china news).
ఈ నేపథ్యంలో హాలీడే సీజన్లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్లైన్లో కొనుగోలు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని యూఎస్ సీబీపీ(కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటక్షన్) హెచ్చరించింది. బొమ్మలను భారీ మొత్తంలోని లీడ్, కాడ్మియమ్, బేరియమ్ కోటింగ్‌లు కనపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
బొమ్మలను ఈ ఏడాది జులై 16న సీబీపీ అధికారులు, సీపీఎస్సీ(కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ సేఫ్టీ కమిషన్) తనిఖీలు చేశారు. మొత్తం 7 బాక్సుల్లో చైనా నుంచి బొమ్మలు వచ్చాయి. వీటిల్లో చాలా వరకు భారత దేశంలోనూ అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఆగస్టు 24న బొమ్మలను ల్యాబ్‌కు పంపించారు. అక్కడే బొమ్మల్లో ప్రమాదకర రసాయనాల కోటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 4న వాటిని అధికారులు సీజ్ చేశారు.
ఇవీ చూడండి:-