ETV Bharat / international

నమస్తే ట్రంప్​: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత నిఘా - ట్రంప్ విమానం ప్రత్యేకత

అమెరికా నిఘా సంస్థ.. అధ్యక్షుడి భద్రత చూసే వ్యవస్థ. అధ్యక్షుడు, ఆయన కుటుంబ రక్షణపై వీరిదే పూర్తి బాధ్యత. ఈ నిఘా సంస్థ ఏజెంట్లు అధ్యక్షుడు పర్యటనకు కొన్ని నెలల ముందే ఆ ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పడతారు. రోడ్డు నుంచి ఆకాశ మార్గం వరకు ఎక్కడ ఎలాంటి ముప్పు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

US Secret Service Shielding the President
అమెరికా అధ్యక్షుడి భద్రత దళం
author img

By

Published : Feb 24, 2020, 6:05 AM IST

Updated : Mar 2, 2020, 8:56 AM IST

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, పురాతన నిఘా సంస్థ 'అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ'. 1865లో దీన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 24/7 అమెరికా అధ్యక్షుడి రక్షణ బాధ్యత ఈ సంస్థదే.

ఈ సంస్థలో దాదాపు 3,200 మంది ప్రత్యేక ఏజెంట్లు ఉంటారు. వాషింగ్టన్​లోని శ్వేతసౌధం, కోశాగారం, విదేశీ దౌత్య కార్యాలయాల రక్షణ బాధ్యతలు చూసే 1,300 మంది అధికారులు ఉంటారు.

సీక్రెట్​ సర్వీస్ ఏజెన్సీ.. అధ్యక్షుడు సహా వారి కుటుంబ భద్రతను పర్యవేక్షిస్తుంది. అధ్యక్షుడి పర్యటనకు వెళ్లే కొన్ని నెలల ముందే ఈ నిఘా సంస్థకు చెందిన ఏజెంట్లు ఆయా ప్రాంతాలు, నగరాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. పూర్తి వివరాలను తెలుసుకుంటారు.

ఎప్పుడైనా ఏమైనా దాడి జరిగితే.. అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికపై సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉంటుంది. అధ్యక్షుడు పర్యటించే ప్రదేశాల్లో సురక్షిత ప్రాంతాలు, ఆసుపత్రుల గురించి ముందే సమాచారం సేకరిస్తారు. ఒకసారి పర్యటన మొదలైతే అధ్యక్షుడి భద్రతే వారికి సర్వం.

నిరంతర నిఘా..

అమెరికా అధ్యక్షుడి భద్రతలో ఏడాది పొడవునా 24/7 ఈ ఏజెన్సీ పని చేస్తుంటుంది. చీమ చిటుక్కుమన్నా దానిని పసిగట్టేంతగా నిఘా పెడుతుంది. ఎంతలా అంటే.. అధ్యక్షుడు​ శౌచాలయానికి వెళ్లినా.. ఆ పరిసరాలపై నిఘా వేస్తుంది ఈ సంస్థ.

భద్రతా వలయం...

పర్యటన సమయంలో అధ్యక్షుడికి 10 మైళ్ల దూరంలో చుట్టూ ఓ అంతర్గత వలయం ఉంటుంది. అధ్యక్షుడికి 18,000 అడుగులకు తక్కువ ఎత్తులో ఎలాంటి విమానాలు, హెలికాఫ్టర్​లు వెళ్లేందుకు, విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యేందుకు వీలులేదు. అధ్యక్షుడి చుట్టూ ఉండే దాదాపు 30 మైళ్ల బాహ్య వలయంలో ఎలాంటి ఎయిర్​క్రాఫ్ట్​లు తిరగకూడదు.

వాహనశ్రేణి...

అధ్యక్షుడి వాహనశ్రేణిలో దాదాపు 20 కార్లు ఉంటాయి. ప్రయాణంలో భద్రతాపరమైన విషయాలను నిఘా వర్గాలు ముందే పసిగడతాయి. రహదారులు మూసివేసినా, భద్రతాపరమైన ఇబ్బందులేమైనా తలెత్తినా రాకెట్​ వేగంతో సమాచారమిస్తాయి.

అధ్యక్షుడి పర్యటనకు అతిథ్యమిచ్చే దేశాల్లోని స్థానిక యంత్రాంగం మరికొన్ని వాహనాలను అధ్యక్షుడి వాహనశ్రేణికి భద్రతగా పంపిస్తాయి. ఎక్కడకు వెళ్లినా ఇవి అధ్యక్షుడి వాహనాలతో​ ఉంటాయి.

జాగిలాలతో...

రోడ్డుపైనా ట్రాఫిక్​ లేకుండా చర్యలు తీసుకుంటారు ఏజెంట్లు. విమానాశ్రయం నుంచి కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళ్లే మార్గంలో జాగిలాలతో తనిఖీ చేస్తారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమ అధీనంలోకి తీసుకుంటారు.

తక్షణ స్పందన దళం...

ఈ నిఘా సంస్థలో అత్యంత ముఖ్యమైనది తక్షణ స్పందన దళం. ఈ బృంద సభ్యులు అధ్యక్షుడి వాహనశ్రేణి చుట్టూ గస్తీ కాస్తుంటారు.

అధ్యక్షుడి వాహనశ్రేణిపై దాడిని ముందే పసిగట్టడమే వీరి బాధ్యత. గుర్తించడమే కాదు అంతే వేగంతో ఏజెంట్లు స్పందిస్తారు. అత్యాధునిక తుపాకీలతో వెంటనే శత్రువుపై వీరు గుళ్ల వర్షం కురిపిస్తారు. వారి దాడిని ప్రత్యర్థి ఊహించే అవకాశం, సమయం రెండూ ఉండవు.

ఇలా ఈ నిఘా దళాలు ఎప్పుడూ అధ్యక్షుడి చుట్టూ ఉంటాయి. ఎప్పుడైనా బహిరంగ ప్రదేశాల్లో ఉంటే ఆ సమయంలో స్థానిక పోలీసులు మరో వలయంలో ఆయనకు రక్షణగా ఉంటారు.

ప్రత్యేక కోడ్​..

అధ్యక్షుడు, ఆయనతో పాటు ఉండే వ్యక్తుల గురించి మాట్లాడుకునేందుకు ఓ ప్రత్యేక కోడ్​ను రూపొందించుకుంటారు సీక్రెట్ ఏజెంట్లు. ఉదాహరణకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను మొఘల్​ అని, ఆయన భార్య మెలానియాను మూస్​ అని పిలుస్తారు.

ఇదీ చూడండి:నమస్తే ట్రంప్​: దిల్లీలో ట్రాఫిక్​ మార్గదర్శకాలు జారీ

Last Updated : Mar 2, 2020, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.