కశ్మీర్ వివాదాన్ని... భారత్-పాకిస్థాన్‌కు సంబంధించిన ద్వైపాక్షిక అంశంగానే పరిగణిస్తున్నట్లు పునరుద్ఘాటించింది అమెరికా. భారత్‌కు అంతర్గత వ్యవహారమైన కశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం కేంద్రం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది అగ్రరాజ్యం.
కశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి మారిందా అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మోర్గన్ ఓర్టగస్ను వాషింగ్టన్లో ప్రశ్నించగా... లేదని సమాధానం ఇచ్చారు.
"అందరూ సంయమనంతో ఉండాలని మేము కోరుతున్నాం. శాంతి, స్థిరత్వాన్ని ప్రధానంగా కోరుకుంటున్నాం. కశ్మీర్, ఇతర సమస్యల పరిష్కారానికి భారత్, పాక్ నేరుగా చర్చించేందుకు మేము మద్దతు ఇస్తాం."
- మోర్గన్ ఓర్టగస్, అమెరికా ప్రతినిధి.
ఇదీ చూడండి: భారత్‌పై ప్రతీకార దుశ్చర్యలు వద్దు: అమెరికా