ETV Bharat / international

'అఫ్గాన్​లో మిగిలిన వారిని కూడా తీసుకెళ్తాం'

author img

By

Published : Sep 1, 2021, 7:58 AM IST

అఫ్గానిస్థాన్​లోని అమెరికా ప్రజలను తీసుకొచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ స్పష్టం చేశారు. మిలటరీ పరంగా కాకుండా దౌత్యపరమైన చర్చలతో ఈ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్తామన్నారు. అఫ్గాన్ ప్రజలకు సహాయాన్ని అగ్రరాజ్యం కొనసాగిస్తుందన్నారు.

US
అమెరికా

అఫ్గానిస్థాన్​లో మిగిలున్న అమెరికా ప్రజలను స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అగ్రరాజ్యం తెలిపింది. తరలింపు ప్రక్రియను మిలిటరీ మిషన్​లా కాకుండా.. దౌత్యపరమైన చర్చలతో ముందుకు తీసుకెళ్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ స్పష్టం చేశారు.

అఫ్గాన్​ ప్రజలకు ఆహారం, వైద్య సదుపాయాలు.. ఇతర సేవలను కొనసాగిస్తామన్నారు. తాలిబన్ల చర్యలను బట్టి ఆర్థిక, అభివృద్ధి పరమైన సహకారాలు కూడా అందిస్తామన్నారు.

దాడులకు సిద్ధం..

ఐసిస్​-కే ఉగ్రవాద సంస్థపై వైమానిక దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం దాడులు తామే చేసినట్లు ఇదివరకే ఐఎస్​ఐస్-కే ప్రకటించింది. ఐఎస్ స్థావరాలను కూల్చేందుకు కూటమి దేశాలకు సహకరిస్తామని బ్రిటన్ వైమానిక దళాధిపతి సర్ మైక్ విగ్​స్టోన్ తెలిపారు.

ప్రపంచ గుర్తింపు కోసం..

అఫ్గాన్​లో సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లకు చైనా సూచనలు చేసింది. అలా అయితేనే.. ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు దేశాలు.. ప్రపంచ చట్టాలను, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అనుసరించాలని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ తెలిపారు. అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని చైనా గౌరవిస్తుందన్నారు. ఆ దేశంలోని వ్యవహారాలపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Donald Trump: 'అఫ్గాన్​పై బాంబులేద్దాం.. మన సామాను తెచ్చేసుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.