ఇటీవల రష్యా జరిపిన సైబర్ దాడి వల్ల ప్రభుత్వ సంస్థలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని శ్వేతసౌధం ప్రకటించింది. త్వరలో అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ చర్య ఇరు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బతీయదని భావిస్తున్నామని పేర్కొంది. ఈ సైబర్ దాడుల గురించి రష్యా అధ్యకుడి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపింది. రష్యన్ నిఘా వర్గాలే ఈ చర్యకు పాల్పడి ఉంటాయని ఆరోపిస్తోంది.
యూఎస్ సహా విదేశీ ప్రభుత్వ సంస్థల నెట్‌వర్క్‌పై దాడి జరిగిందని అధికారులు తెలిపారు. అయితే దీని ప్రభావం పెద్దగా ఏమీ లేదని పేర్కొన్నారు. సైబర్ దాడికి సంబంధిత సంస్థలు ప్రభావితమైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
3,000 ఈమెయిల్ అకౌంట్స్..
యూఎస్ ఎజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ)కి చెందిన ఈమెయిల్ మార్కెటింగ్ అకౌంట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. దీనితో పాటు 150 సంస్థలకు చెందిన 3,000 ఈమెయిల్ అకౌంట్స్‌పై దాడికి ప్రయత్నించారు.
ఇదీ చదవండి : చైనా నౌకల నుంచి ఆహారం దిగుమతికి అమెరికా నో!