పన్నెండో శతాబ్దానికి చెందిన నటరాజ కంచు విగ్రహంతోపాటు మొత్తం 248 ప్రాచీన కళాఖండాలను అమెరికా గురువారం భారత్‌కు వెనక్కి ఇచ్చింది. వీటి విలువ రూ.112 కోట్లు (15 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. గత దశాబ్దకాలంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని రికవరీ చేసినట్లు మాన్‌హట్టన్ జిల్లా అటార్నీ వాన్స్ తెలిపారు.
ఈ పురాతన వస్తువులను భారత్‌కు అందజేసేందుకు ఓ కార్యక్రమం నిర్వహించింది అమెరికా. భారత కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: ఐరాస మీటింగ్‌లో డైనోసర్- ప్రపంచ నేతలకు వార్నింగ్