ETV Bharat / international

అమెరికాలో ప్రతి నిమిషానికి ఒక కరోనా మరణం! - corona cases in us

అమెరికాలో కరోనా తీవ్రత పెరిగిపోతోంది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మొత్తం మరణాలు 2.50 లక్షలు దాటాయి. రానున్న రోజుల్లో దేశంలో పరిస్థితులు మరింత క్షీణిస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్​తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

US records more than 250,000 COVID deaths; situation to get worse: experts
అమెరికాలో 2.50 లక్షల కొవిడ్​ మరణాలు-పరిస్థితి తీవ్రం!
author img

By

Published : Nov 19, 2020, 4:25 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరింతగా విజృంభిస్తోంది. కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 13 లక్షల 49 వేలు దాటింది. కేసులు 5 కోట్ల 62 లక్షలపైనే. అమెరికాలో తొలి దశ కంటే ఇప్పుడు బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. మరణాలు 2 లక్షల 50 వేల మార్కును అధిగమించాయి.

జాన్స్​ హాప్కిన్స్​ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. యూఎస్​లో కోటీ 15 లక్షల కరోనా కేసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇక్కడే అధికం.

కరోనాతో ప్రతి నిమిషానికీ అమెరికాలో ఒకరు చనిపోతున్నారని సీఎన్ఎన్​ వార్తాసంస్థ నివేదించింది. ఈ లెక్కన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని జార్జి వాషింగ్టన్​ యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్​ ప్రొఫెసర్ డా.జొనాథన్​ రీనర్​ హెచ్చరించారు. ​

''2,3 వారాల క్రితం దేశంలో రోజుకు సగటున 70 నుంచి 80 వేల కేసులు నమోదయ్యేవి. కానీ నిన్న(మంగళవారం) లక్షా 55 వేల మందికి కరోనా సోకింది. అంతకుముందు 1700గా నమోదైన మరణాలు సంఖ్య.. ఇప్పుడు 3 వేలకు చేరిందంటే.. పరిస్థితి కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.''

- జొనాథన్​ రీనర్​, ప్రొఫెసర్​

అమెరికాలో కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కొవిడ్​ ట్రాకింగ్​ ప్రాజెక్ట్​ పేర్కొంది. మంగళవారం ఆ సంఖ్య 76, 830గా ఉంది.

మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. దేశంలో 2 లక్షల మందికిపైగా మరణాలు నమోదయ్యే అవకాశాలున్నాయని మార్చిలోనే అంచనా వేశారు ఫౌచీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.