ETV Bharat / international

రెండు లక్షల హెచ్‌-1బీ వీసాలకు ముప్పు! - హెచ్‌-1బీ వీసాలకు ముప్పు

అమెరికాలో గ్రీన్​ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న సుమారు 2 లక్షల మంది తమ హెచ్​-1బీ వీసా చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం ఉందని తేలింది. వీరిలో కొంతమంది ఉద్యోగ వీసా కోల్పోనుండాగా, మరికొందరు గడువు సమయం దాటిన కారణంగా కోల్పోనున్నట్లు ప్రముఖ ఇమ్మిగ్రేషన్‌ అనలిస్ట్‌ జెరేమీ న్యూఫెల్డ్‌ తెలిపారు.

US received over 2 lakh H-1B visa applications, completes lottery
రెండు లక్షల హెచ్‌-1బీ వీసాలకు ముప్పు!
author img

By

Published : Apr 29, 2020, 8:30 PM IST

అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్‌ కార్డు) పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న దాదాపు 2,50,000 మందిలో సుమారు 2,00,000 మంది జూన్‌ చివరి నాటికి తమ హెచ్‌-1బీ వీసా చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. వీరిలో కొంతమంది ఉద్యోగాలు పోయి వీసాను కోల్పోనుండగా.. మరికొంత మంది పునరుద్ధరణ సమయం మించిపోతుండడం వల్ల కోల్పోనున్నారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న థింక్‌ట్యాంక్‌ నిస్కనేన్‌ సెంటర్‌తో కలిసి తాను చేసిన అధ్యయనంలో తేలిందని ప్రముఖ ఇమ్మిగ్రేషన్‌ అనలిస్ట్‌ జెరేమీ న్యూఫెల్డ్‌ తెలిపారు. వీరితో పాటు గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నించని వారికి కూడా ప్రమాదం తప్పకపోవచ్చునని అంచనా వేశారు.

నిబంధనల వల్ల కోత..

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న వారిలో భారత్‌, చైనా వాసులే అత్యధికం. కావున ఈ ప్రభావం భారతీయులపై భారీగానే ఉండనుంది. హెచ్‌-1బీ వీసా పొందడానికి అనేక షరతులు ఉంటాయి. ఉద్యోగం కల్పించే సంస్థ కనీస వేతనం కల్పిస్తానన్న హామీతో పాటు మరికొన్ని నిబంధనలను అంగీకరిస్తేనే వీసా ఇస్తారు. వేతన కోతలు, వర్క్‌ ఫ్రం హోం వసతి వంటివి నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కరోనా సంక్షోభం వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ రకంగానూ కొంతమంది తమ హెచ్‌-1బీ వీసాను కోల్పోయే అవకాశం ఉందని న్యూఫెల్డ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి కొంతమందికి ఉద్యోగ భద్రత ఉన్నా.. భవిష్యత్తుపై భరోసా లేదని తెలిపారు.

60 రోజుల నిబంధన..

మరికొన్ని సంస్థలు పూర్తిగా ఉద్యోగులనే తొలగించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో హెచ్‌-1బీ వీసాదారులు సైతం ఉన్నారు. ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో మరో ఉద్యోగం పొందాలి. లేదా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్ని ఒబామా పాలనాకాలంలో అధికారిగా పనిచేసిన డోగ్‌ ర్యాండ్‌ వీసా సంక్షోభంగా అభివర్ణించారు. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీరిపై ఆధారపడి ఉన్న కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గడువు పొడిగించండి.. లేదంటే

మరోవైపు యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌​, మైక్రోసాఫ్ట్‌ తదితర దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న టెక్‌నెట్‌ అనే లాబీయింగ్‌ గ్రూప్‌ ఏప్రిల్‌ 17న హోంల్యాండ్‌‌ సెక్యూరిటీ విభాగానికి ఓ లేఖ రాసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీ నిపుణులకు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసా గడువు సెప్టెంబరు 10 వరకు పొడిగించాలని కోరింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై పడబోయే దుష్ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడింది. కరోనా సంక్షోభం వల్ల వీసా జారీ, పునరుద్ధరణ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని.. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత 60 రోజులు మాత్రమే దేశంలో ఉండాలన్న నిబంధనను సవరించి ఆ గడువును 180 రోజులకు పెంచాలని హెచ్‌-1బీ వీసాదారులు శ్వేతసౌధాన్ని కోరనున్నారు. ఈ మేరకు సంతకాల సేకరణ కొనసాగుతోంది. ఈ రెండింటిపై ట్రంప్‌ పాలనాయంత్రాంగం ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటు భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉంటున్న భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. దీనిపై స్పందించిన ఇమిగ్రేషన్‌ శాఖలోని ఓ ఉన్నతాధికారి ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇక వలసల విషయంలో తొలినుంచీ కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఇప్పటికే గ్రీన్‌ కార్డుల జారీ సహా అన్నిరకాల వలసల్ని రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా మాటున వలసలపై తన సొంత అజెండాను అమలు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని పొడిగించాలో లేదో తర్వాత నిర్ణయిస్తామని ప్రకటించి మరింత ఆందోళనలోకి నెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.