ETV Bharat / international

హెచ్​1బీ వీసాలపై మరిన్ని ఆంక్షల దిశగా ట్రంప్​ సర్కార్​! - హెచ్​1బీ వీసా నిబంధనల్లో మార్పులు

విదేశీ నిపుణులకు అందించే హెచ్​1బీ వీసాల నిబంధనల్లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించింది అమెరికా విదేశాంగ శాఖ. హెచ్​1బీకు సంబంధించి ప్రత్యేక వృత్తులకు తాత్కాలిక వ్యాపార వీసాలు జారీ చేయకూడదని వెల్లడించింది. ఈ ప్రతిపాదనతో భారతీయులు, భారతీయ సంస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది.

US proposes not to issue business visas for H-1B
హెచ్​1బీ వీసా
author img

By

Published : Oct 22, 2020, 10:51 AM IST

హెచ్​1బీ వీసాలపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హెచ్​1బీ పరిధిలోకి వచ్చే విదేశీ నిపుణులకు తాత్కాలిక వ్యాపార వీసాలను జారీ చేయకూడదని భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుత నిబంధనలు సవరించాలని​ అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదనలు చేసింది.

అమెరికాలో విధులను పూర్తిచేయడానికి గానూ సంస్థలు తమ సాంకేతిక నిపుణులను యూఎస్‌కు పంపేందుకు, వారు అక్కడ తాత్కాలికంగా ఉండేందుకు ప్రస్తుత విధానం వీలు కల్పిస్తోంది.

"ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే హెచ్​ పాలసీకి బదులుగా బీ-1 ద్వారా విదేశీ నిపుణులు దేశంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం లభిస్తుంది. ప్రతిపాదిత మార్పులు, దాని ఫలితంగా వచ్చే పారదర్శకత హెచ్​-1బీ వీసాదారుల ద్వారా అమెరికా ఉద్యోగులపై పడే ప్రభావాన్ని తగ్గిస్తుంది. నిబంధనల్లో మార్పుతో దుర్వినియోగానికి అడ్డుకట్టపడుతుంది."

- అమెరికా విదేశాంగ శాఖ.

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ హెచ్​1బీ వీసా నిబంధనల్లో మార్పు ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

భారతీయులపై ప్రభావం..

అమెరికా విదేశాంగ శాఖ తాజా నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది. అమెరికాలోని తమ పనులను పూర్తి చేసేందుకు స్వల్పకాలం పాటు సాంకేతిక నిపుణులను పంపించే భారతీయ సంస్థలపైనా ఈ ప్రభావం అధికంగా ఉండనుంది.

ఇదీ చూడండి: హెచ్‌-1బీపై ఆంక్షలతో అమెరికాకే ఆర్థిక ముప్పు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.