ఏప్రిల్ 19 నాటికి అమెరికాలోని వయోజనుల్లో 90 శాతం మంది టీకా తీసుకునేందుకు అర్హులవుతారని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. వారందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
"ఈరోజు నుంచి మరో మూడు వారాల్లోగా వయోజనుల్లో 90 శాతం మంది.. కొవిడ్ టీకా తీసుకునేందుకు అర్హులవుతారని చెప్పేందుకు సంతోషంగా ఉంది. అమెరికన్లకు తమ నివాసం నుంచి 5 మైళ్ల దూరంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. మిగిలిన 10శాతం మందికి కూడా మే1లోపు నుంచే టీకాలను అందిస్తాం."
-అమెరికా అధ్యక్షుడు, జో బైడెన్
వైరస్ కట్టడికి అందరూ ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. కరోనాపై విజయానికి ఎక్కువ దూరం లేదన్నారు.
ఇదీ చూడండి:మయన్మార్ హింసపై జో బైడెన్ ఆందోళన