ETV Bharat / international

బైడెన్​ గ్రాఫ్​ ఏడాదిలో భారీగా పతనం- మళ్లీ పోటీ చేయొద్దంటున్న ప్రజలు! - బైడెన్ పనితీరు సర్వే

Biden approval rating: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పనితీరు పట్ల అక్కడి ప్రజలు అంతగా సంతృప్తిగా లేరని తాజా సర్వేలో వెల్లడైంది. అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేస్తున్నారని భావించే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సుమారు 50 శాతం మంది.. బైడెన్ తిరిగి పోటీ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.

Biden approval rating
Biden approval rating
author img

By

Published : Jan 20, 2022, 12:33 PM IST

Biden approval rating: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన నేపథ్యంలో ఆసక్తికరమైన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. అధ్యక్ష పదవిని సరిగా నిర్వహించడం లేదని మెజారిటీ ప్రజలు బైడెన్​ను విమర్శించారు. కరోనా మహమ్మారి, ధరల పెరుగుదల కారణంగా బైడెన్​ గ్రాఫ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్-ఎన్ఓఆర్​సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ కలిసి ఈ సర్వే చేపట్టాయి.

AP NORC poll Joe Biden

అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారని జో బైడెన్​కు 43 శాతం మంది మాత్రమే ఓటేశారు. జులైలో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో 59 శాతం బైడెన్ అధ్యక్ష బాధ్యతలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్​లో ఇది 50 శాతంగా ఉంది.

Joe Biden covid response

కరోనా నియంత్రణలోనూ బైడెన్ పనితీరుపై అనేక మంది నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. 45 శాతం మంది మాత్రమే కరోనాపై బైడెన్ పనితీరు సంతృప్తికరంగా స్పందించారు. 2021 జులైలో 66 శాతం, డిసెంబర్​లో 57 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

Biden re election chances

2024 ఎన్నికల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాలని 28 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 2024లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగానే ఉంటారని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, 50 శాతం మంది మాత్రం.. బైడెన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండలేరని అభిప్రాయపడ్డారు.

Joe Biden survey results

ఆర్థిక వ్యవస్థ విషయంలో 37 శాతం మంది మాత్రమే బైడెన్​ను మెచ్చుకున్నారు. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పన్ను విధానాలు, అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడం వంటి అంశాల వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది.

బైడెన్ అధ్యక్షుడయ్యాక దేశం ఐకమత్యం సాధించిందని 16 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా.. అమెరికా మరింత విభజనకు గురైందని 43 శాతం మంది పేర్కొన్నారు.

శ్వేతసౌధాన్ని సమర్థంగా నిర్వహించే సత్తా బైడెన్​కు ఉన్నట్లు 28 శాతం మంది 'సంపూర్ణ విశ్వాసం' చూపారు. 38 శాతం మంది మాత్రం బైడెన్​పై అసలు నమ్మకం లేదని చెప్పారు. 33 శాతం మంది బైడెన్​ను కొంతవరకు నమ్ముతున్నట్లు తెలిపారు.

అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటితో పోలిస్తే బైడెన్ మెరుగైన స్థితిలోనే ఉన్నారని సర్వే పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో ట్రంప్​ పనితీరును 35 శాతం మంది మెచ్చుకోగా.. తాజాగా బైడెన్​ను 33 శాతం మంది ఆమోదించారని తెలిపింది.

'నేనొప్పుకోను!'

అయితే, ఈ సర్వేను బైడెన్ ఆమోదించలేదు. అధ్యక్షుడి మానసిక ఆరోగ్యంపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. బైడెన్ వాటిని ఖండించారు. 'ఈ సర్వేలను నేను నమ్మను' అంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: '2024 ఎన్నికల్లో నా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిసే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.