2008 ముంబయి దాడులకు ముఖ్య సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ కోర్టు జైలు శిక్ష విధించడంపై అమెరికా అభినందనలు తెలిపింది. హఫీజ్, ఆయన అనుచరులకు జైలుశిక్ష విధించడం గొప్ప ముందడుగు అని పేర్కొంది.
లష్కరే తొయిబా ఉగ్రకార్యకలాపాలకు ఆ సంస్థలోని వారిని జవాబుదారీగా చేయడం, ఉగ్రముఠాలకు ఆర్థిక సహాయం అందకుండా చర్యలు వంటి అంతర్జాతీయ కట్టుబాట్లకు తగిన విధంగా పాక్ వ్యవహరించడంపై అభినందిస్తూ ట్వీట్ చేశారు అమెరికా దౌత్యవేత్త అలీస్ వెల్స్.
ఇదీ చూడండి: మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్!