US Police Helicopter Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా తీరంలోని హంటింగ్టన్ బీచ్ పోలీస్ విభాగానికి చెందిన హెలికాప్టర్.. సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరొక అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
California Helicopter crash in water
శనివారం సాయంత్రం 6.30 గంటలకు హెలికాప్టర్.. సముద్ర జలాల్లో క్రాష్ ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. న్యూపోర్ట్ బీచ్ సమీపంలో ఓ ఘటన జరగ్గా.. పోలీసులు హెలికాప్టర్లో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు.
చనిపోయిన పోలీస్ అధికారిని నికోలస్ వెల్లా(44)గా గుర్తించారు. ఆయన 14 ఏళ్లుగా రాష్ట్ర పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. గాయపడిన మరో అధికారి పేరును వెల్లడించలేదు. ఆయన 16 ఏళ్ల నుంచి తమ విభాగంలో సేవలందిస్తున్నారని అధికారులు తెలిపారు.
నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు, ఆరెంజ్ కౌంటీ షెరిఫ్కు చెందిన యాక్సిడెంట్ రీకంస్ట్రక్షన్ టీమ్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.
ఇదీ చదవండి: కిమ్ సాగు బాట.. భూమిని బాంబులతో పేల్చి శంకుస్థాపన!