ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ప్రారంభించిన విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల కూటమి (సీడీఆర్ఐ)కి మద్దతుగా అమెరికా రూ.66 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. పర్యావరణ హిత మౌలిక వసతుల ఏర్పాట్లపై సీడీఆర్ఐతో కలిసి పనిచేస్తామని పేర్కొంది.
"విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల ఏర్పాటుకు అమెరికా కట్టుబడి ఉంది. 2019 సెప్టెంబరులో భారత్ అధికారికంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు పాల్గొంటున్నాయి. రోడ్లు, విమానాశ్రయాలు, పవర్ గ్రిడ్లు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయన్న మాట వాస్తవం. కానీ వాటి వల్ల పర్యావరణానికి హానికలిగే అవకాశాలు కూడా ఎక్కువే."
-యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలెప్మెంట్
వాతావరణ మార్పులకు అనుకూలంగా మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేసే దేశాలకు తాము మద్దతుగా ఉంటామని యూఎస్ఏఐడీ స్పష్టం చేసింది.
భారత్ ప్రవేశ పెట్టిన సీడీఆర్ఐలో ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, శ్రీలంక సహా 18 దేశాల ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి.
ఇదీ చదవండి : మూతపడిన ట్రంప్ ఫ్లోరిడా క్లబ్- కారణమిదే