ETV Bharat / international

'ఉక్రెయిన్​పై యుద్ధంలో చైనా సాయం కోరిన రష్యా'

US China News: అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్​పై యుద్ధంలో రష్యా.. చైనా సాయం కోరుతోందని, ఆయుధాలు ఇవ్వాలని అడిగిందని ఆరోపించారు. అయితే చైనా మాత్రం వీటిని ఖండించింది.

us-official-russia-seeking-military-aid-from-china
చైనా సాయం కోరిన రష్యా!
author img

By

Published : Mar 14, 2022, 12:18 PM IST

US China: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. పలు నగరాల్లో బాంబులు, క్షిపణుల మోత మోగుతూనే ఉంది. రష్యాను అడ్డుకునేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలు వేల కొద్దీ ఆంక్షలు విధించినప్పటికీ.. క్రెమ్లిన్‌ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. పుతిన్‌ వ్యవహారంపై చర్చించేందుకు నేడు చైనాతో భేటీ కానుంది. అయితే సమావేశానికి కొద్ది గంటల ముందు అమెరికా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో రష్యా.. చైనా సాయం కోరుతోందని, ఆయుధాలు ఇవ్వాలని అడిగిందని ఆ అధికారి ఆరోపించారు.

"ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా.. మరింత ముందుకెళ్లేందుకు ఇటీవల చైనా సాయం కోరినట్లు తెలిసింది. సైనిక పరికరాలు, ఆయుధాలు ఇవ్వాలని అభ్యర్థించింది" అని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది. అయితే చైనా సాయం ఎందుకు కోరిందన్న వివరాలను మాత్రం సదరు అధికారి చెప్పలేదని పేర్కొంది.

US China Meet:

అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తమ నుంచి రష్యా ఎలాంటి సాయం కోరలేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి లీ పెంగ్యూ వెల్లడించారు. "ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళన కరంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు చైనా ముందున్న ప్రథమ ప్రాధాన్యత" అని లీ అన్నారు.

US China Relations

చైనాకు అమెరికా వార్నింగ్‌..

ఇదిలా ఉండగా.. రష్యా దండయాత్ర నేపథ్యంలో అమెరికా, చైనా ప్రతినిధులు సోమవారం రోమ్‌లో భేటీ కానున్నారు. అమెరికా తరఫున జాతీయ భద్రతా సలహాదారుడు జాక్‌ సులివన్‌, చైనా నుంచి విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్‌ జీచీ దీనికి హాజరుకానున్నారు. యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆ దేశంపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు వంటి అంశాలు దీనిలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేస్తే చైనాకు ఆర్థికపరంగా భారీ పెనాల్టీలు తప్పవని కూడా ఈ సమావేశంలో బీజింగ్‌ను అమెరికా హెచ్చరించనున్నట్లు సమాచారం.

"రష్యాకు సాయం చేస్తే ఆ తర్వాత కచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే చైనాను నేరుగా, వ్యక్తిగతంగా హెచ్చరించాం. ఈ విషయంలో చైనా ముందుకెళ్లడాన్ని మేం అంగీకరించబోం. ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో ఏ దేశమైనా రష్యాకు లైఫ్‌లైన్‌గా ఉంటానంటే మేం ఒప్పుకునేది లేదు" అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్ సులివన్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​పై భీకర దాడులు.. నో ఫ్లైజోన్​ ప్రకటనకు జెలెన్​స్కీ వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.