అమెరికా ఉపాధ్యక్షురాలుగా కమలా హారిస్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఓ నర్సును పోలీసులు అరెస్టు చేశారు! ఇందుకు సంబంధించి పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఫ్లోరిడాకు చెందిన నివియాన్ పెటిల్ ఫెల్ఫ్స్(39)నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రస్తుతం జైలులో ఖైదీగా ఉన్నాడు. ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు జేపే అనే కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా మాట్లాడుకునే అవకాశముంది.
ఇలా ఫిబ్రవరి 13-18 మధ్య ఫెల్ప్స్ తన భర్తతో మాట్లాడింది. ఆ సందర్భంగా కమలా హారిస్‌కు ఉద్దేశపూర్వకంగా హాని తలపెట్టేలా ఫెల్ప్స్ మాట్లాడినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ల పట్ల విద్వేష వ్యాఖ్యలతో పాటు.. కోపంగా మాట్లాడుతూ ఉన్న వీడియోలను సీఎన్ఎన్ ఉటంకించింది. ఆ వీడియోలలో "కమలా హారిస్ త్వరలోనే చనిపోతారు. మీరు రోజులు లెక్కిస్తున్నారంటూ" ఫెల్ప్స్ పలు ప్రకటనలు చేసినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
మరో వీడియోలో.. "ఈ రోజును గుర్తుపెట్టుకోండి.. దేవుడిపై ప్రమాణం చేస్తున్నాను.. నేటి నుంచి 50 రోజుల్లో మీరు అంతం అవ్వబోతున్నారు. నేను తుపాకీ శ్రేణితో వస్తున్నాను.. మీరు చనిపోయే రోజు దగ్గర్లోనే ఉందంటూ" తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సీఎన్ఎన్ తన కథనంలో వివరించింది.
ఇవీ చదవండి: అమెరికాలో విషం చిమ్ముతున్న 'గన్ కల్చర్'