ETV Bharat / international

అమెరికా నావికాదళంలో తొలి కరోనా కేసు! - corona case in navy department america

అమెరికా నావికాదళంలోని ఓ నావికుడికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నేవీ విభాగంలో ఇది తొలి కరోనా కేసు అని పేర్కొన్నారు. అయితే దీన్ని వైద్యులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు.

US Navy reports first suspected virus case on ship
యుద్ధనౌక నావికుడికి కరోనా పాజిటివ్!
author img

By

Published : Mar 16, 2020, 4:24 PM IST

అమెరికా యుద్ధనౌకలో ఓ నావికుడికి కరోనా సోకినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయ్యిందని ఆ దేశ నేవీ వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులపాటు దక్షిణ ఇటలీ నౌకాశ్రయంలో విధులు నిర్వహించిన సైనికుడే వైరస్​ బారినపడినట్లు తెలిపారు అధికారులు.

అయితే, ఇది కేవలం ప్రాథమిక నిర్ధరణ మాత్రమేనని, అమెరికా వ్యాధి నియంత్రణ-నిరోధక కేంద్రం పరిశీలించిన తర్వాతే తుది ధ్రువీకరణ వెలువడుతుందని చెప్పారు నేవీ అధికారులు.

కరోనా సోకిన సైనికుడు యూఎస్​ఎస్​ బాక్సర్ యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ నౌక కాలిఫోర్నియాలోని శాన్​ డీగోలో ఉన్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు.

"యూఎస్ఎస్ బాక్సర్ (ఎల్‌హెచ్‌డీ 4) అనే ఉభయచర యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్న ఒక నావికుడికి కరోనా వైరస్ సోకినట్లు ప్రాథమిక నిర్ధరణ అయ్యింది. ఇది నేవీ విభాగంలో తొలి కరోనా కేసు. అతడిని కలిసిన వ్యక్తులను వెంటనే గుర్తించాం. ప్రస్తుతం వారంతా గృహ నిర్బంధంలో ఉన్నారు. "

- అమెరికా నేవీ

ఇదీ చదవండి:గేదె క్షేమం కోసం దూడకు గుండు కొట్టారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.