అమెరికా వాషింగ్టన్లోని భారత రాయభార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విగ్రహంపై రంగులు చల్లి అగౌరవ పరిచారు. ఈవిషయంపై భారత అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరనసగా అమెరికాలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు ప్రజలు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే వాషింగ్టన్లోని గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వారం రోజులుగా జరుగుతున్న నిరసనల్లో పలు చారిత్రక, పవిత్ర ప్రదేశాలను కూడా ధ్వసం చేశారు ఆందోళనకారులు. లింకన్ స్మారకం, ప్రసిద్ధ చర్చిలో విధ్వంసం సృష్టించారు.
వాషింగ్టన్లో ధ్వంసమైన గాంధీ విగ్రహాన్ని దివంగత నేత, భారత మాజీ ప్రధాని 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సమక్షంలో అంకితం చేశారు.
భారత రాయబార కార్యాలయం వెబ్సైట్లో వివరాల ప్రకారం గాంధీ విగ్రహాన్ని కాంస్యంతో చేశారు. 8 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉంటుంది. భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య దీనిని బహూకరించింది. విగ్రహం బరువు 16 టన్నులు.
ఈ ఘటనపై భారత్లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ క్షమాపణలు చెప్పారు. మహాత్ముని విగ్రహానికి ఇలా జరిగి ఉండకూడదన్నారు.