ETV Bharat / international

చైనాకు 'కరెన్సీ మానిపులేటర్'​ ముద్ర వేసిన అమెరికా

చైనా కరెన్సీ యువాన్​ భారీ తగ్గుదలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. వాణిజ్య రంగంలో ప్రయోజనాల కోసం కరెన్సీ రేట్లను డ్రాగన్​ దేశం మారుస్తోందని ఆరోపించింది. కరెన్సీని మోసపూరితంగా మార్చే దేశమని చైనాపై అధికారిక ముద్రవేసింది అమెరికా.

చైనా
author img

By

Published : Aug 6, 2019, 12:26 PM IST

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. చైనా కరెన్సీ యువాన్​ తగ్గుదలపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా మోసపూరితంగా కరెన్సీ విలువను మార్చే దేశమని అధికారిక ముద్ర వేసింది. వాణిజ్య రంగంలో పోటీ ప్రయోజనం పొందేందుకు యువాన్​ను డ్రాగన్​దేశం అక్రమంగా వాడుకుంటోందని ఆరోపించింది.

డాలర్​తో పోలిస్తే సోమవారం యువాన్​ విలువ 7.03కు పడిపోయింది. 11ఏళ్లలో ఈ స్థాయికి పతనం కావటం ఇదే తొలిసారి. అమెరికా మరోసారి పన్నులు పెంచనున్నట్లు చేసిన ప్రకటనను తటస్థీకరించడానికి యువాన్​ మారకం విలువను చైనా తగ్గించిందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చైనా కంపెనీలు కొనుగోళ్లు చేయటం నిలిపేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీ తెరపైకి వచ్చింది. నిర్ణయం చకచకా అమలైంది.

"ట్రంప్​ సూచనల మేరకు చైనాను కరెన్సీ మానిపులేటర్​ దేశంగా ప్రకటిస్తున్నాం."

- ట్రెజరీ శాఖ, అమెరికా

ట్రంప్​ కూడా ఇదే విషయమై స్పందించారు.

US-CHINA-LD TRADE
ట్రంప్ ట్వీట్

"చైనా ఉద్దేశపూర్వకంగా అమెరికా నుంచి వందల కోట్ల డాలర్లు దోచుకుంటోంది. ఇందుకు అక్రమ వాణిజ్య వ్యూహాలు, మోసపూరితంగా కరెన్సీ మార్పులను వినియోగిస్తోంది."

-డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'ఆపరేషన్​ కశ్మీర్​'తో స్టాక్​మార్కెట్లు విలవిల

Surat (Gujarat), Aug 06 (ANI): In a unique way to celebrate the abrogation of Article 370, students of Shree Swaminarayan Gurukul School in Gujarat's Surat created a human chain on Monday. The students sat on the ground in an order to create '370' with a cross on it. They were also seen waiving the Indian flag on the occasion. To celebrate this moment, teachers thought of creating a human chain like this. The Central government had revoked Article 370 which gave special status to Jammu and Kashmir and proposed that the state be bifurcated into two Union Territories, Jammu and Kashmir and Ladakh. The Jammu and Kashmir (Reorganisation) Bill, 2019, strips Jammu and Kashmir's status of a state and converts it into a Union Territory with legislature and carving out Ladakh region as a UT without legislature.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.