అమెరికాలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన ఆదిత్య వేములపాటి అనే వ్యక్తిని అమెరికా మాన్హట్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాన్హట్టన్ యూనియన్ స్క్వేర్లోని రైల్వే స్టేషన్లో రైలు కోసం చూస్తున్న లిలియానా లానోస్ అనే మహిళను పట్టాలపైకి తోశాడు ఆదిత్య. ఈ ఘటనలో ఆమెకు గాయలయ్యాయి. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధరించారు.
అతడిని విచారించిన జడ్జి డిసెంబరు 4వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.