అగ్రరాజ్యంలో కరోనా (Covid USA)మరణాల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మూడు నెలల్లోనే లక్ష మందికిపైగా వైరస్‌కు (Covid deaths in US) బలయ్యారు. డెల్టా వ్యాప్తితో (Delta in USA) కరోనా ఉద్ధృతి తీవ్రం కాగా.. సగటున రోజుకు 2 వేల మంది వైరస్‌కు ప్రాణాలు కోల్పోయారు.
కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతకొద్ది వారాలుగా నమోదవుతున్న రోజువారీ సగటు కేసుల సంఖ్య పడిపోతోంది. దీంతో ఆస్పత్రుల్లో రోగుల రద్దీ తగ్గిపోయింది. అయితే, కరోనా ఇప్పుడే పూర్తిగా అంతమైనట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో మరో వేవ్ అమెరికాపై ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
దేశమంతటా నాలుగో వేవ్ అత్యున్నత దశకు చేరుకుందని వైద్య నిపుణులు వెల్లడించారు. అయితే, ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయని తెలిపారు. సుమారు ఏడు కోట్ల మంది అమెరికన్లు ఇంకా టీకా తీసుకోలేదని చెప్పారు. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
కొత్త కేసులు...
అమెరికాలో కొత్తగా లక్షా 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 1,821 మంది మరణించారు. వారం క్రితం రెండు వేలకు పైగా మరణాలు సంభవించాయని, ప్రస్తుతం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టడం కొంతమేర ఉపశమనం కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు.
ఇతర దేశాల్లో ఇలా..
- యూకేలో కొత్తగా (UK Covid Cases) 35 వేల కేసులు బయటపడ్డాయి. 127 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7 కోట్ల 84 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1,36,789గా ఉంది.
- టర్కీలో 28,873 కొవిడ్ కేసులు (Turkey Covid cases) నమోదయ్యాయి. 210 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో 24,522 మంది కొత్తగా కరోనా (Russia Covid cases) బారిన పడ్డట్లు తేలింది. 887 మరణాలు సంభవించాయి.
- బ్రెజిల్లో 18,578 కేసులు (Brazil Covid Cases) నమోదు కాగా, 492 మంది మరణించారు.
ఇదీ చదవండి: అక్కడ కొవిడ్ టెస్టుకు రూ. 40 లక్షల బిల్లు!