ETV Bharat / international

'అమెరికాలో 2 కోట్ల మందికి వైరస్​!' - కరోనా వైరస్​ అమెరికా కేసులు

అమెరికాలో కరోనా వైరస్​పై తాజా అంచనాలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2కోట్ల మందికిపైగా ప్రజలు ఇప్పటికే వైరస్​ బారిన పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్షల్లో లోపాలతో వీటిని గుర్తించలేకపోతున్నామని పేర్కొన్నారు. అయితే దేశ జనాభాలో ఇంకా అనేక మందికి వైరస్​ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

US health officials estimate 20M Americans have had virus
అమెరికాలో 2కోట్ల మంది ప్రజలకు కరోనా!
author img

By

Published : Jun 26, 2020, 5:28 PM IST

అమెరికావ్యాప్తంగా 2కోట్ల మంది ప్రజలు కరోనా వైరస్​ బారినపడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇంకా అనేక మందికి వైరస్​ ప్రమాదం పొంచి ఉందని అనుమానిస్తున్నారు. కరోనాపై విజయం సాధించినట్టు ప్రకటించి.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఈ వార్త ఆందోళన కలిగించే విషయం.

ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు అగ్రరాజ్యంలోనే వెలుగుచూశాయి. గురువారం నాటికి అమెరికావ్యాప్తంగా 23 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. అంటే తాజా అంచనాలు ఈ కేసుల కన్నా దాదాపు 10రెట్లు ఎక్కువ. కరోనా​ సోకినట్టు తెలియకుండానే చాలా మంది వైరస్​ బారినపడుతున్న విషయం అధికారులకు ముందే తెలుసు. పరీక్ష నిర్వహణలో జాప్యం కారణంగా అనేక కేసులను గుర్తించలేకపోతున్నట్టు భావిస్తున్నారు.

అమెరికా జనాభా 33.1 కోట్లు​. అందులో 2 కోట్లు అంటే 6శాతం. అయితే దేశంలో ఇంకా చాలా మందికి ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలోని రోగ నిరోధక, నివారణ కేంద్రం(సీడీసీ) అధ్యయనం ఆధారంగా అధికారులు ఈ విషయం వెల్లడించారు. సీడీసీ సేకరించిన రక్త నమూనాలు, రక్త దానాలు, ఇతర వివరాల ఆధారంగా ఈ పరిశోధన చేశారు. తొలినాళ్లలో జరిగిన పరీక్షల్లో లోపాలు, లక్షణాలుంటేనే పరీక్షలు చేయడం వల్ల వైరస్​ను గుర్తించలేకపోయినట్టు అధికారులు భావిస్తున్నారు.

కేసులు పెరుగుతున్నా..

అమెరికాలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే గతంలో కన్నా ఈసారి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని.. అంతా అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:- 'భారత్​-అమెరికా బంధంపైనా వీసా ప్రభావం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.