ETV Bharat / international

'భారత్​కు అమెరికా 500 మిలియన్​ డాలర్ల సాయం' - white hous latest news

కొవిడ్​పై పోరులో భాగంగా ఇప్పటివరకు భారత్​కు తాము 500 మిలియన్​ డాలర్ల సాయం అందించామని శ్వేతసౌధం తెలిపింది. త్వరలోనే.. వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. భారత్​కు అదనపు సాయం అందించాలని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

us india
భారత్​కు అమెరికా సాయం
author img

By

Published : May 20, 2021, 10:03 AM IST

కరోనాపై పోరులో బారత్​కు అమెరికా సహకారం కొనసాగుతోంది. ఇప్పటివరకు 500మిలియన్​ డాలర్ల సాయాన్ని తాము భారత్​కు అందించామని శ్వేతసౌధం బుధవారం తెలిపింది. త్వరలోనే.. వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈ మేరకు విలేకరుల సమావేశంలో శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్​ సాకి పేర్కొన్నారు.

"ఇప్పటివరకు భారత్​కు 500 మిలియన్​ డాలర్ల కొవిడ్​ సాయాన్ని అమెరికా అందించింది. ఇప్పుడు కరోనాతో ప్రభావితమైన ఇతర ఆసియా దేశాలకు మద్దతుగా నిలవాలని బైడెన్​ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మేము ఏడు విమానాల ద్వారా ఆక్సిజన్​ ఉత్పత్తి పరికరాలు, ఎన్​95 మాస్కులు, ఔషధాలు, ర్యాపిడ్​ డయోగ్నస్టిక్స్​ పరీక్ష కిట్ల వంటి కరోనా సాయాన్ని భారత్​కు పంపించాం."

-జెన్​ సాకి, వైట్​హౌస్​ మీడియా సెక్రెటరీ

త్వరలోనే ప్రపంచ దేశాలకు 8కోట్ల కరోనా టీకాలను సరఫరా చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఇటీవల ప్రకటించారు. అందులో 6కోట్ల టీకా డోసులు ఆస్ట్రాజెనెకావి కాగా.. మిగతా 2కోట్ల టీకా డోసులు మూడు అనుమతి పొందిన ఇతర సంస్థలకు చెందినవని జెన్​సాకి వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ల పంపిణీ చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

తీర్మానం ఏకగ్రీవ ఆమోదం..

కొవిడ్​పై భారత్ పోరులో బైడెన్ ప్రభుత్వ సహకారాన్ని వేగవంతం చేసే తీర్మానాన్ని కాంగ్రెస్​లోని ప్రతినిధుల సభలోని విదేశాంగ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీనిని కాంగ్రెస్ సభ్యులు బ్రాడ్ షెర్మన్, స్టీవ్ ఛాబట్ రూపొందించారు. ఈ తీర్మానానికి విదేశీ వ్యవహారాల కమిటీలోని 13 మంది సభ్యులు సహా 24 మంది సభ్యులు మద్దతు తెలిపారు.

కరోనా ప్రారంభ దశలో అమెరికాకు భారత్​ చేసిన సాయాన్ని ఈ తీర్మానం గుర్తించింది. వ్యాక్సిన్​ ఉత్పత్తి, ఇతర దేశాలకు సాయం చేసిన అంశాన్ని పేర్కొంది. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న భారత్​కు ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు, క్రయోజనిక్​ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటెయినర్లు, అత్యావసర ఔషధాలు వంటి అదనపు సాయాన్ని అందజేయాలని కోరింది.

6 కోట్ల టీకా డోసులు అందించాలి..

కరోనా రెండో దశ విజృంభణతో సతమతమవుతున్న భారత్​కు.. బైడెన్​ ప్రభుత్వం అండగా ఉండాలని అమెరికాలోని మానవ హక్కుల కార్యకర్త రీవ్​ జెస్సీ జాక్సన్​ కోరారు. ఇతర దేశాలకు సాయం చేస్తామన్న 8 కోట్ల టీకా డోసుల్లో భారత్​కు ఆరు కోట్ల టీకా డోసులను అందజేసి ఆదుకోవావాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ను కోరారు. ప్రపంచమంతా ఇప్పడు కరోనా కోరల నుంచి భారత్​ కోలుకోవాలని ప్రార్థిస్తోందని పేర్కొన్నారు. ఆయనకు కాంగ్రెస్ సభ్యుడు, ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి మద్దతు తెలిపారు.

కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన భారత్​, అర్జెంటీనా వంటి దేశాలకు అమెరికా సాయాన్ని విస్తృతం చేసేందుకు ఉపకరించే ఓ చట్టాన్ని ప్రతినిధుల సభలో రాజా కృష్ణమూర్తి ప్రవేశపెట్టారు. ద నల్లిఫైయింగ్​ ఆపర్చునిటీస్​ ఫర్​ వేరియంట్స్​ టు ఇన్​ఫెక్ట్​ అండ్​ డెసిమేట్​(నోవిడ్​) యాక్ట్​ పేరుతో ఈ చట్టాన్ని రూపొందించారు.

ఇదీ చూడండి: 'భారత్ వేరియంట్​పై అమెరికా టీకాలు భేష్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.