ETV Bharat / international

'భారత్​కు సాయపడటం అమెరికా నైతిక బాధ్యత' - ప్రమీలా జయపాల్​ అమెరికా

కరోనాపై పోరులో భారత్​కు అండగా నిలవడం అమెరికా నైతిక బాధ్యత అని పేర్కొన్నారు ఆ దేశ చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్​. టీకా పంపిణీ విషయంలో అసమానతలు తలెత్తకుండా సంబంధిత దేశ రాయబారులతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.

ప్రమీలా జయపాల్​ అమెరికా, us moral responsibility
ప్రమీలా జయపాల్​
author img

By

Published : May 7, 2021, 12:42 PM IST

కరోనాను ఎదుర్కోవడంలో భారత్​కు సాయపడటం అమెరికా నైతిక బాధ్యత అని ఆ దేశ చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్​ తెలిపారు. ప్రస్తుతం భారత్​లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఈ సమయంలో భారత్​కు సాయం అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేయడం అమెరికా నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సంధుతో గురువారం జరిగిన వర్చువల్​ సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్​కు వ్యాక్సిన్​ సంబంధిత పరికరాల పంపిణీ, టీకాల పంపిణీ సహా వ్యాక్సిన్ల పేటేంట్ రద్దుపై అమెరికా సానుకూలంగా స్పందించిందన్నారు. టీకాలు అందుబాటులో అసమానతలు ఏర్పడుతున్న నేపథ్యంలో బైడెన్​ ప్రభుత్వం చేపట్టిన చర్యలు భారత్​కు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా టీకాల అందుబాటు.. ధనిక దేశాల్లో 80 శాతం ఉండగా, పేద దేశాల్లో కేవలం 0.3 శాతమే ఉందని వెల్లడించారు.

ఈ అసమానతలను కట్టడి చేసేందుకు సంబంధిత దేశ రాయబారులతో కలిసి కృషి చేస్తామని.. అవసరమైన దేశాలకు సరిపడా డోసులు అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఇటీవల ప్రమీలా.. కొవిడ్​ బారిన పడిన ఆమె తల్లిదండ్రులను పరామర్శించేందుకు భారత్​లో పర్యటించారు.

ఇదీ చదవండి : భారత్​లో కరోనాపై వివేక్​మూర్తి ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.