ETV Bharat / international

రష్యా అధికారులపై అమెరికా, ఈయూ ఆంక్షలు

author img

By

Published : Mar 2, 2021, 9:19 PM IST

నావల్నీ అరెస్టుకు కారణమైన రష్యా అధికారులపై అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. అధికారులతో పాటు రసాయనాలు తయారు చేసే సంస్థలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది.

US, EU sets sanctions over Russia opposition leader's poisoning and jailing
రష్యా అధికారులపై అమెరికా, ఈయూ ఆంక్షలు

రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగం సహా, జైలుకు పంపడానికి కారణమైన అధికారులు, వ్యాపారాలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. రష్యాలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పలు చర్యలు తీసుకోనున్నట్లు బైడెన్ యంత్రాంగం ఇదివరకే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా బైడెన్ సర్కార్ విధించిన తొలి ఆంక్షలు ఇవే కావడం గమనార్హం.

ఆంక్షలు విధించిన అధికారుల పేర్లను అమెరికా వెల్లడించలేదు. అయితే, 14 వ్యాపారాలు, ఓ సంస్థపై ఆంక్షలు కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో చాలా వరకు రసాయనాల తయారీకి సంబంధించినవే ఉన్నాయి.

ఈయూ సైతం

అటు, ఐరోపా సమాఖ్య(ఈయూ) సైతం రష్యా అధికారులపై కొరడా ఝులిపించింది. నావల్నీ జైలు శిక్షకు కారణమైన నలుగురిపై ఆంక్షలను విధించింది. ప్రయాణాల నిషేధం సహా ఐరోపాలోని ఆస్తులను స్తంభింపజేయాలని నిర్ణయించింది.

రష్యన్ ఫెడరేషన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ హెడ్ అలెగ్జాండర్ బస్ట్రీకిన్, ప్రాసిక్యూటో జనరల్ ఇగార్ క్రాస్నోవ్, నేషనల్ గార్డ్ హెడ్ విక్టోర్ జోలోటోవ్, ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ హెడ్ అలెగ్జాండర్ కలష్నికోవ్​లపై ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు తెలిపింది.

నావల్నీ అరెస్టుతో పాటు, శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను అణచివేస్తున్నందుకు ఈ ఆంక్షలు విధించినట్లు ఈయూ పేర్కొంది. మరికొందరు అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విషప్రయోగం.. జైలు శిక్ష..

నావల్నీపై గతేడాది ఆగస్టులో విషప్రయోగం జరిగింది. నొవిచోక్​ అనే రసాయనాన్ని ఆయనపై ప్రయోగించినట్లు తేలింది. పుతిన్ సెక్యూరిటీ సర్వీస్ ఏజెంట్లే ఈ దాడికి పాల్పడ్డాయని అమెరికా సహా పలు ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని నెలల పాటు జర్మనీలో చికిత్స తీసుకున్న నావల్నీ.. జనవరిలో మాస్కోకు తిరిగి వచ్చారు. స్వదేశానికి రాగానే.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు రష్యా అధికారులు. ఐరోపాలో ఉన్నప్పుడు పెరోల్ నిబంధనలను ఉల్లంఘించారని అభియోగాలు మోపారు. దీనిపై అక్కడి కోర్టు రెండు సంవత్సరాల 8 నెలల జైలు శిక్ష విధించింది. నావల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా రష్యాలో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. వీటిని అణచివేసేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దాదాపు 11 వేల మందిని నిర్బంధించింది. పలువురికి స్వల్పకాలిక శిక్షలను విధించింది.

ఇదీ చదవండి: 'నావల్నీ' నిరసనలు ఉద్ధృతం- 5000 మందికిపైగా అరెస్ట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.