ETV Bharat / international

అమెరికా ఎన్నికలు: బైడెన్​ 306.. ట్రంప్​ 232..! - అమెరికా అధ్యక్షుడు

ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్తి ఫలితాలపై ఓ స్పష్టత వచ్చింది. ఆరిజోనాలో నెగ్గి.. జార్జియాలో విజయానికి అతిసమీపంలో ఉన్న డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​ 306 ఎలక్టోరల్​ ఓట్లు దక్కించుకోనున్నారు. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. 232కే పరిమితం కానున్నారు.

US Elections: Joe Biden wins Arizona, Georgia; final vote tally for Democrats is 306
అమెరికా ఎన్నికలు: బైడెన్​ 306.. ట్రంప్​ 232
author img

By

Published : Nov 14, 2020, 5:32 AM IST

Updated : Nov 14, 2020, 9:38 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల లెక్కలు దాదాపుగా తేలాయి. ప్రెసిడెంట్​ ఎలక్ట్​ జో బైడెన్​ శుక్రవారం.. ఆరిజోనాలో గెలుపొందారు. జార్జియాలో గెలుపునకు అతిసమీపంలో ఉన్నారు. ఫలితంగా ఈ డెమొక్రాట్​ అభ్యర్థి ఎలక్టోరల్​ ఓట్ల సంఖ్య 306కు చేరినట్లు అంచనా వేస్తున్నారు. నార్త్​ కరోలినాలో విజయానికి దగ్గరైన ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి 232 వద్దే ఆగిపోనున్నారు.

ఈ మేరకు న్యూయార్క్​ టైమ్స్​, సీఎన్​ఎన్​, ఇతర వార్తాసంస్థలు నివేదించాయి. దాదాపు ఓట్ల లెక్కింపు పూర్తయిన వేళ.. ఫలితాలపై ఇలా అంచనాలు వేశాయి.

ఇవి అచ్చం 2016 అధ్యక్ష ఎన్నికలను ప్రతిబింబించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు డొనాల్డ్​ ట్రంప్​నకు 306.. డెమొక్రాట్​ అభ్యర్థి హిల్లరీ క్లింటన్​కు 232 ఎలక్టోరల్​ ఓట్లు దక్కాయి. ఇప్పుడు కూడా అవే సంఖ్యలో ఎలక్టోరల్​ ఓట్లు రావడం అరుదైన విషయం. కానీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి.

ఇదీ చూడండి: 'ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత సురక్షితం'

క్లింటన్​ తర్వాత బైడెనే..

2016లో ట్రంప్​ నెగ్గిన జార్జియా, ఆరిజోనా, మిషిగన్​, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఈసారి బైడెన్​ వైపు మొగ్గడం విశేషం. 1992(బిల్​ క్లింటన్​) తర్వాత.. జార్జియాలో నెగ్గబోయే డెమొక్రాట్​ అభ్యర్థి బైడెనే.

ట్రంప్​ను ఓడించడం ద్వారా బైడెన్​కు అమెరికా 46వ అధ్యక్షుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. ట్రంప్​ ఇంకా తన ఓటమిని అంగీకరించడం లేదు.

ఇదీ చూడండి: అమెరికా ఎన్నికలపై ఎట్టకేలకు స్పందించిన చైనా

Last Updated : Nov 14, 2020, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.