అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతోన్న కొద్దీ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎలక్టోరల్ ఓట్లలో బైడెన్ చాలా ముందంజలో ఉన్నప్పటికీ.. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కొనసాగుతోంది.
గెలుపును నిర్దేశించే రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానాల్లో ట్రంప్ గెలిస్తే ప్రస్తుతం నెలకొన్న అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా అతిస్వల్పంగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదీ చూడండి: ట్రంప్ గెలుపునకు ఈ మెలికే కారణం!