ETV Bharat / international

లెక్కలు తారుమారు- పుంజుకున్న ట్రంప్! - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 ట్రంప్ ఆధిక్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు. అనేక పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించిన ఆయన.. ఎలక్టోరల్​ ఓట్లలో మొదటి నుంచి ముందంజలో ఉన్న బైడెన్​ను ఓ దశలో దాటేశారు. లెక్కింపు కొనసాగుతోన్న మిగిలిన రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. ఇలాగే కొనసాగితే గెలుపు తథ్యమే.

trump
ట్రంప్
author img

By

Published : Nov 4, 2020, 12:25 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోరులో అంచనాలను తలకిందులు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్​ పుంజుకున్నారు.

ఎలక్టోరల్ ఓట్లలో మొదటి నుంచి వెనుకంజలో ఉన్న ఆయన.. కీలక రాష్ట్రాలైన టెక్సాస్​, ఫ్లోరిడాను కైవసం చేసుకుని ప్రత్యర్థి బైడెన్​ను ఓ దశలో దాటేశారు. ఇంకా లెక్కిపు కొనసాగుతోన్న కీలక రాష్ట్రాల్లోనూ ట్రంప్​ ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న విస్కాన్సిస్, మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియాలోనూ గెలిస్తే మళ్లీ అధ్యక్ష పీఠం ట్రంప్​కే దక్కనుంది.

ట్రంప్ గెలిచిన రాష్ట్రాలివే..

టెక్సాస్​, ఫ్లోరిడా, ఓహోయో, టెన్నెసీ, కెంటకి, ఇండియానా, ఓక్లహోమా, వెస్ట్‌ వర్జీనియా, సౌత్‌ కరోలైనా, సౌత్‌ డకోటా, నార్త్‌ డకోటా, కేన్సస్‌, అలబామా, లూసియానా, ఆర్కాన్సా, మిస్సోరి, యూటా, మిస్సిసిప్పీ, నెబ్రాస్కా, వయోమింగ్‌.

ఈ రాష్ట్రాల్లో బైడెన్..

కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినొయ్, న్యూజెర్సీ, మేరీలాండ్, వాషింగ్టన్‌, మాసాచుసెట్స్‌, కొలరాడోలో, కనెక్టికట్‌, ఓరెగన్‌, న్యూమెక్సికో, న్యూహాంప్‌షైర్‌, డెలవెర్‌, డీసీ, వెర్మాంట్‌.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రాల్లో ట్రంప్ గెలిస్తే ఫలితాలు తారుమారే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.