కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,14,00,035 మంది మహమ్మారి బారినపడ్డారు. 5,33,874 మంది వైరస్ సోకి మృతిచెందారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 29,35,993 | 1,32,318 |
బ్రెజిల్ | 15,78,376 | 64,365 |
రష్యా | 6,81,251 | 10,161 |
పెరూ | 2,99,080 | 10,412 |
చిలీ | 2,91,847 | 6,192 |
బ్రిటన్ | 2,84,900 | 44,198 |
మెక్సికో | 2,52,165 | 30,366 |
ఇటలీ | 2,41,419 | 34,854 |
ఇరాన్ | 2,37,878 | 11,408 |
కేసులు తగ్గుముఖం.. కానీ
అమెరికాలో నాలుగు రోజుల అనంతరం తొలిసారి వైరస్ కేసులు సంఖ్య 50వేల కన్నా తక్కువ నమోదయ్యాయి. శనివారం మొత్తం 45,300 కేసులు వెలుగుచూశాయి. అయితే దీనితో సంబరపడిపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ నెల 4న స్వతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన నేపథ్యంలో.. కేసుల సంఖ్య మరోసారి భారీ స్థాయిలో పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
విదేశీ కార్మికులు విలవిల..
సింగపూర్‌లో ఉన్న విదేశీ కార్మికులను కరోనా వైరస్ వదలడం లేదు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు విదేశీ కూలీలే ఉంటున్నారు. తాజాగా 136 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 118 మంది విదేశీ కార్మికులే.
సింగపూర్‌లో 44,800 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
వరుసగా మూడో రోజు...
దక్షిణ కొరియాలో వరుసగా మూడో రోజు 60కుపైగా నమోదయ్యాయి. తాజాగా 61మంది వైరస్ బారినపడినట్టు అధికారుల వెల్లడించారు. వీరిలో 43 మంది స్థానికులని, మిగిలిన 18 మంది విదేశీయులను పేర్కొన్నారు. అయితే ఈ 43లో 41 మంది రాజధాని సియోల్, గ్వాంగ్జు, డైజియాన్ నగరాలకు చెందినవారేనని తెలిపారు.
దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13,091 మందికి వైరస్ సోకింది. 283 మంది మరణించారు.
చైనాలో 8కేసులు..
వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో కొత్తగా 8 కేసులు బయటపడ్డాయి. వీటిలో రాజధాని బీజింగ్‌కు సంబంధించి రెండు కేసులున్నాయి. అయితే బీజింగ్‌లో కరోనా 2.0 వ్యాప్తిని చైనా విజయవంతంగా కట్టడిచేసినట్టు కనిపిస్తోంది. వరుసగా 7వ రోజు సింగిల్ డిజిట్ కేసులే నమోదవడం ఇందుకు నిదర్శనం.
చైనాలో ఇప్పటివరకు 83,553 కేసులు వెలుగుచూశాయి. 4,634 మంది మరణించారు.
ఇదీ చూడండి:- కరోనా విజృంభిస్తున్నా బార్లు, రెస్టారెంట్లు రీఓపెన్