గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంతర్జాతీయ హ్యాకర్లు ప్రభావితం చేశాయని వస్తున్న కథనాలపై అమెరికా అధికారులు స్పందించారు. రష్యా, చైనా, ఇరాన్ దేశాల్లోని కొన్ని సంస్థలు ఎన్నికల్లో హ్యాకింగ్ పాల్పడాలని కుట్రపన్నాయని తేల్చారు. అయితే వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు.
రష్యాకు చెందిన స్ట్రాంటియమ్, చైనాకు చెందిన జిర్కోనియం, ఇరాన్‌కు చెందిన ఫాస్పరస్ సంస్థలు ఈ మేరకు హ్యాకింగ్‌కు పాల్పడ్డాయని గతేడాది మైక్రోసాఫ్ట్ సంస్థ ఆరోపించింది.
ఇదీ చదవండి : కారుపై కుప్పకూలిన విమానం- ముగ్గురు మృతి