ETV Bharat / international

అమెరికాలో కరోనాతో రోజుకు 1,600 మంది మృతి - corona virus in us

ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 1.69 కోట్ల కేసులు నమోదయ్యాయి. 6.63 లక్షల మంది మృత్యువాతపడగా సుమారు కోటి మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

WORLD TRACKER
అమెరికా
author img

By

Published : Jul 29, 2020, 10:15 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రలయం కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.

రోజుకు 1,600 మంది మృతి..

అగ్రరాజ్యంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 64,729 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 44.98 లక్షల మందికి వైరస్ సోకింది. వైరస్ ధాటికి 75 రోజులుగా సగటున 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం1,52,320 మంది మరణించారు.

బ్రెజిల్​లో..

అమెరికా తర్వాత బ్రెజిల్​లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 41 వేల కేసులు పెరగగా.. మొత్తం సంఖ్య 24.84 లక్షలకు చేరింది. 88,634 మంది చనిపోయారు.

స్థిరంగా పెరుగుదల..

రష్యాలో స్థిరంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 5వేల కేసులు నమోదుకాగా.. మొత్తం సంఖ్య 8.23 లక్షలకు పెరిగింది. ఇప్పటివరకు 13 వేల మరణాలు సంభవించాయి.

దక్షిణాఫ్రికా, మెక్సికో, పెరూ, చిలీ, ఇరాన్, కొలంబియాలో రోజురోజుకు మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. స్పెయిన్​లో మళ్లీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వివిధ దేశాల వారీగా..

దేశం మొత్తం కేసులు కొత్తగా నమోదైనవి మృతుల సంఖ్య
అమెరికా 44,98,343 64,729 1,52,320
బ్రెజిల్ 24,84,649 41,169 88,634
రష్యా 8,23,515 5,395 13,504
దక్షిణాఫ్రికా 4,59,761 7,232 7,257
మెక్సికో 3,95,489 4,973 44,022
పెరూ 3,95,005 5,288 18,612
చిలీ 3,49,800 1,877 9,240
స్పెయిన్ 3,27,690 1,828 28,436
బ్రిటన్ 3,00,692 581 45,878
ఇరాన్ 2,96,273 2,667 16,147

ఇదీ చూడండి: కరోనా వేళ పాకిస్థాన్​కు తిరిగి రాలేను: షరీఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.