ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్‌తో తీవ్ర ముప్పు పొంచి ఉందని అమెరికా సైబర్ భద్రతా అధికారులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇవి రష్యా పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫెడరల్ ప్రభుత్వం, స్థానిక, రాష్ట్ర, ట్రైబల్ ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలకూ ఈ హ్యాకింగ్ ప్రమాదకారిగా మారుతోందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మంట్‌కు చెందిన సైబర్ భద్రతా విభాగం పేర్కొంది.
ప్రభుత్వం ఏజెన్సీల్లోని ఖజానా, వాణిజ్య విభాగాల్లో.. సురక్షితమైన డేటా, ఈమెయిల్ సమాచారం హాక్కు గురైన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ హెచ్చరికలు చేసింది. నెట్వర్క్ ద్వారా చొరబడిన మాల్వేర్ను తొలగించడం చాలా కష్టమని పేర్కొంది. ఈ ముప్పు నుంచి బయటపడడం ఒక సవాల్ అని తెలిపింది.