ETV Bharat / international

ప్రపంచంపై కొవిడ్ పంజా- అమెరికాలో 2.27 లక్షల కేసులు - uk covid

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. అమెరికాలో ఒక్కరోజే ఏకంగా 2.27 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 1544 మంది చనిపోయారు. అటు ఇతర దేశాల్లోనూ కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది.

us covid cases
us covid cases
author img

By

Published : Dec 23, 2021, 9:55 AM IST

US covid cases: అమెరికాలో కరోనా విలయం మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,27,605 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 1544 మంది ప్రాణాలు కోల్పోయారు. 104,606 మంది కోలుకున్నారు.

World Covid cases

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 8,85,052 కేసులు వెలుగులోకి వచ్చాయి. 7,220 మంది ప్రాణాలు కోల్పోయారు.

Omicron USA cases

కేసుల వ్యాప్తి నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలో మాస్కు తప్పనిసరి అనే నిబంధనను అమలులోకి తెచ్చారు. రెస్టారెంట్లు, బార్లు, నైట్​ క్లబ్​లు, జిమ్​లలోకి వెళ్లే 12 ఏళ్లు పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధన జనవరి 15 నుంచి అమలవుతుందని చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని విద్యార్థులందరూ మార్చి 1లోపు రెండు డోసులు తీసుకోవాలని స్పష్టం చేశారు. బూస్టర్ డోసులు తీసుకోవాలని సిఫార్సు చేశారు. అయితే, దీన్ని తప్పనిసరి నిబంధనల్లో చేర్చలేదు. చర్చిలు, కిరాణ దుకాణాలు, అవుట్​డోర్ స్టేడియాల్లోకి టీకా తీసుకోకపోయినా అనుమతిస్తారు.

UK covid cases!

యూకేలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్త కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 147,573కు పెరిగింది.

ఈ నేపథ్యంలో చిన్నారులకు టీకాలు అందించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది యూకే వైద్య ఏజెన్సీ. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఫైజర్ మినీ టీకాను అందించాలని నిర్ణయించింది. రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి, వైరస్ బాధితులకు దగ్గరగా మెలిగిన వారికి ముందుగా టీకా ఇవ్వాలని సూచించింది. 16-17 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లకు, 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న అధిక రిస్కు గల పిల్లలకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పెద్దలకు ఇచ్చే టీకాలో మూడో వంతును పిల్లలకు ఇస్తారు. ఎనిమిది వారాల వ్యవధిలో రెండు డోసులు పంపిణీ చేస్తారు.

అయితే, దేశంలో లాక్​డౌన్ విధించే అవకాశం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. కొత్త ఆంక్షలు సైతం ఉండబోవని స్పష్టం చేశారు.

ఫ్రాన్స్​లో 84 వేల కేసులు

ఫ్రాన్స్​లోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. 84,272 కేసులు వెలుగులోకి వచ్చాయి. 170 మంది వైరస్ తీవ్రతకు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 8,798,028కు పెరిగింది.

లాక్​డౌన్ ఉండదు!

మరోవైపు, ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. లాక్​డౌన్ విధించే అవకాశం లేదని ఆ దేశ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. మాస్కు తప్పనిసరి నిబంధననూ విధించబోమని చెప్పారు. కరోనా కట్టడికి ఆంక్షలపై ఆధారపడాలని అనుకోవడం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసులను తీసుకోవాలని సూచించారు. దేశంలోని న్యూసౌత్​ వేల్స్​లో రికార్డు స్థాయిలో 5715 కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు.

స్లొవేనియాలో కొత్త నిబంధనలు

కరోనా నేపథ్యంలో స్లొవేనియా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దుకాణాల్లో పది చదరవు మీటర్లకు ఒక కస్టమర్ మాత్రమే ఉండాలని నిబంధన విధించింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన అందరూ.. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని స్పష్టం చేసింది. బూస్టర్ డోసులు తీసుకున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పించింది. దేశంలో కొత్తగా 1,255 కేసులు నమోదు కాగా.. ఆరుగురు మరణించారు.

ఆఫ్రికాలో..

ఆఫ్రికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య తొమ్మిదిన్నర లక్షలు దాటిందని ఆఫ్రికా సీడీసీ వెల్లడించింది. మృతుల సంఖ్య 226,536గా ఉందని తెలిపింది. ఈ ఖండంలోని దక్షిణాఫ్రికా, మొరాకో, లిబియా, ఇథియోపియా, ట్యునీషియా దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది.

స్పెయిన్​లో మాస్కు నిబంధన

వీధుల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను స్పెయిన్ ప్రభుత్వం మరోసారి అమలు చేయాలని నిర్ణయించింది. రోజువారీ కేసుల సంఖ్య బీభత్సంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో 24 గంటల వ్యవధిలో 60,041 కేసులు వెలుగులోకి వచ్చాయి. 50 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 88,937గా నమోదైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి అనే నిబంధన జూన్ వరకు అమలైంది. ఆ తర్వాత దాన్ని నిలిపివేశారు.

వెనుజువెలాలో ఒమిక్రాన్

ఒమిక్రాన్ బాధిత దేశాల్లో వెనుజువెలా చేరింది. ఒకేసారి ఏడు కేసులు బయటపడ్డాయి. వెనుజువెలాలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవేనని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురో వెల్లడించారు. పనామా, స్పెయిన్, డొమినికన్ రిపబ్లిక్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఈ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.