ETV Bharat / international

అమెరికా కోర్టులో నీరవ్​ మోదీకి చుక్కెదురు - నీరవ్ మోదీ తాజా సమాచారం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి అమెరికా​ కోర్టులో చుక్కెదురైంది. తమపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలని నీరవ్ మోదీతో పాటు ఆయన సహచరులు చేసిన పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది.

Nirav Modi
నిరవ్​ మోదీ
author img

By

Published : Oct 19, 2021, 4:24 PM IST

Updated : Oct 19, 2021, 4:31 PM IST

రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అమెరికా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను కొట్టేయాలని నీరవ్ మోదీతో పాటు ఆయన సహచరులు చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్​లోని దివాలా కోర్టు తోసిపుచ్చింది.

అమెరికా కేంద్రంగా పని చేసే ఫైర్​స్టార్​ డైమండ్, ఫాంటసీ ఇంక్, ఏ జాఫ్​ సంస్థలకు మోదీ ఒకప్పుడు పరోక్షంగా యజమానిగా ఉండేవారు. అయితే... పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. ఆ మూడు సంస్థలకు కోర్టు ట్రస్టీని నియమించింది.

మూడు సంస్థల ద్వారా నీరవ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ట్రస్టీ రిచర్డ్ లెవిన్.. ఓ పిటిషన్ దాఖలు చేశారు. నీరవ్​కు, ఆయన సన్నిహితులకు రుణాలు ఇచ్చి మోసపోయిన వారికి 15 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే... రిచర్డ్ ఆరోపణలను కొట్టేయాలని కోరుతూ నీరవ్ బృందం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. వారికి నిరాశ ఎదురైంది.

ఇదీ చూడండి: ఆ మహిళా ఉద్యోగితో బిల్​ గేట్స్​ అలా..!

Last Updated : Oct 19, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.