ETV Bharat / international

'అమెరికాలో లక్ష మందికిపైగా కరోనాకు బలవుతారు'

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా విజృంభిస్తోన్న వేళ దేశంలో లక్ష మందికిపైగా కరోనాకు బలవుతారని అక్కడి ఆరోగ్య శాఖ నిపుణుడు ఒకరు అంచనా వేశారు. ఇప్పటికే అమెరికాలో కేసుల సంఖ్య లక్షా 40 వేలు దాటింది. మరో 2400 మందికిపైగా మరణించారు.

US could see 100,000-200,000 deaths from COVID-19: Top health expert
'అమెరికాలో లక్ష మందికిపైగా కరోనాకు బలవుతారు'
author img

By

Published : Mar 30, 2020, 5:21 AM IST

అమెరికాపై కరోనా పడగ విప్పుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్యా అదే స్థాయిలో ఉంది. దేశంలో కేసుల సంఖ్య లక్షా 40 వేలను మించిన తరుణంలో.. మరణాల సంఖ్యను అంచనా వేశారు అమెరికా ఆరోగ్య శాఖ నిపుణుడు ఫౌచీ.

''అమెరికాలో మిలియన్ల కొద్దీ కేసులు నమోదవుతాయి. అదే స్థాయిలో మరణాల సంఖ్య లక్షను మించుతుంది. ప్రస్తుత కేసులు, ఇతర పరిస్థితుల్ని పరిశీలిస్తే.. మొత్తం లక్ష నుంచి 2 లక్షల మధ్య మరణాలు సంభవించే అవకాశముంది.''

- ఆంటోనీ ఫౌచీ, జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్

శ్వేతసౌధం నియమించిన కరోనా వైరస్​ టాస్క్​ ఫోర్స్​లో ఫౌచీ కీలక సభ్యుడు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కొవిడ్​-19 బెడద రానున్న రోజుల్లోనూ తగ్గే అవకాశాలు కనిపించడం లేదని జోస్యం చెప్పారు.

అమెరికాలో కరోనా కేసులు ఇప్పటివరకు లక్షా 40 వేలను దాటాయి. మరణాలు 2 వేల 400పైనే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో సగానికిపైనా న్యూయార్క్​లోనే సంభవించడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.