ETV Bharat / international

'రిపబ్లికన్ల నిర్లక్ష్యం వల్లే నాకు కరోనా' - భారత సంతతి ప్రమీళా జయపాల్

భారత సంతతికి చెందిన అమెరికా చట్ట సభ్యురాలు ప్రమీలా జయపాల్​ రిపబ్లికన్లపై మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం కారణంగా తనకు కరోనా సోకిందని ఆరోపించారు. మాస్కులు ధరించని సభ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

US-VIRUS-JAYAPAL
'వారి నిర్లక్ష్యం వల్లే నాకు కరోనా'
author img

By

Published : Jan 12, 2021, 8:15 PM IST

Updated : Jan 12, 2021, 8:32 PM IST

రిపబ్లికన్ల నిర్లక్ష్యం వల్లే తనకు కరోనా సోకిందని ఆరోపించారు అమెరికా చట్ట సభ్యురాలు ప్రమీలా జయపాల్. ఈ విషయంపై ఆమె మంగళవారం ట్వీట్​ చేశారు.

"నాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పార్లమెంటులో తలదాచుకున్న రోజు రిపబ్లికన్​ నేతలు మాస్కు ధరించడానికి నిరాకరించడమే కాకుండా మాస్కు అందించిన వారిని ఎద్దేవా చేశారు."

-ప్రమీలా జయపాల్ , అమెరికా కాంగ్రెస్​ సభ్యురాలు

వారిపై చర్యలు చేపట్టాలి..

'మాస్కులు ధరించని నేతల మధ్య ఉన్న నేను వెంటనే క్వారంటైన్​ అయ్యాను. నేను భయపడినట్లుగానే కొవిడ్ పాజిటివ్​ వచ్చింది' అని ప్రమీలా అన్నారు. క్వారంటైన్​ అయినా కూడా తన శక్తి మేరకు పనిచేస్తానని తెలిపారు. పార్లమెంటులో మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : 'అభిశంసన, నామినేషన్ ప్రక్రియను విడదీయండి'

Last Updated : Jan 12, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.