అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. వ్యాక్సినేషన్‌ను ప్రోత్సాహించేందుకు ఆ రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన లాటరీలో హైడీ రెస్సెల్ను విజేతగా ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్ జార్డ్ పోలీస్. దాని ద్వారా 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.45కోట్లు) గెలుచుకుంది.
ఈ విషయం తెలియగానే తను ఆశ్చర్యానికి గురైనట్లు పేర్కొంది హైడీ. ఒక రోజంతా నమ్మలేకపోయాయని తెలిపింది.
అమెరికాలో టీకా తీసుకునేలా.. ప్రజలను ప్రోత్సహించడానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది కొలరాడో రాష్ట్ర సర్కారు. దీనిలో భాగంగా టీకా తీసుకునే అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్ డాలర్లు (రూ.7.45కోట్లు) బహుమానంగా ఇస్తామని ప్రకటించింది.
అయితే లాటరీ పథకంతో టీకాలు తీసుకున్నవారి సంఖ్య పెరగలేదని డాటా ఆధారంగా తెలుస్తోంది. రాష్ట్రంలో మే 26 నుంచి జూన్ 26 వరకు ఐదు లక్షలకు పైగా టీకా అందించారు. లాటరీ ప్రకటించిన ముందు నెల కంటే టీకాలు తీసుకున్న వారి సంఖ్య 43 శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
17ఏళ్ల లోపు వారికి మాత్రం మరో ప్రత్యేకమైన లాటరీని ప్రకటించారు. ఇందులో విజేతలకు డబ్బులు ఇవ్వరు.. ఏడాది పాటు స్కూల్ స్కాలర్‌షిప్‌ను ఇవ్వనున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖరీదైన వ్యవహారం.
ఇదీ చూడండి: అమెరికాలో కరోనా 'డెల్టా' విజృంభణ- చిన్నారుల్లోనూ...